IPO: స్టార్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఐపీఓ నేడే..పెట్టుబడి పెడతారా?

ప్రముఖ ఆరోగ్య బీమా సంస్థ స్టార్‌ హెల్త్‌ అండ్‌ అలైడ్‌ ఇన్సూరెన్స్‌ పబ్లిక్‌ ఇష్యూ నేడు ప్రారంభమైంది....

Published : 30 Nov 2021 11:09 IST

దిల్లీ: ప్రముఖ ఆరోగ్య బీమా సంస్థ స్టార్‌ హెల్త్‌ అండ్‌ అలైడ్‌ ఇన్సూరెన్స్‌ పబ్లిక్‌ ఇష్యూ నేడు ప్రారంభమైంది. ఇందులో వెస్ట్‌బ్రిడ్జ్‌ కేపిటల్‌, రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలాకు పెట్టుబడులు ఉన్నాయి. నేడు ప్రారంభమైన ఈ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌ డిసెంబరు 2న ముగియనుంది.

ఈ ఐపీఓకి సంబంధించిన వివరాలు...

ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభ తేదీ: నవంబరు 30, 2021

ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌ ముగింపు తేదీ: డిసెంబరు 2, 2021

బేసిస్‌ ఆఫ్‌ అలాట్‌మెంట్‌ తేదీ: డిసెంబరు 07, 2021

రీఫండ్‌ ప్రారంభ తేదీ: డిసెంబరు 8, 2021

డీమ్యాట్‌ ఖాతాకు షేర్ల బదిలీ తేదీ: డిసెంబరు 9, 2021

మార్కెట్‌లో లిస్టయ్యే తేదీ: డిసెంబరు 10, 2021

ముఖ విలువ: రూ.10 (ఒక్కో ఈక్విటీ షేరుకు)

లాట్‌ సైజు: 16 షేర్లు

కనీసం ఆర్డర్‌ చేయాల్సిన షేర్లు: 16 (ఒక లాట్‌)

గరిష్ఠంగా ఆర్డర్‌ చేయాల్సిన షేర్లు: 208 (13 లాట్లు)

ఐపీఓ ధర శ్రేణి: ₹870 - ₹900 (ఒక్కో ఈక్విటీ షేరుకు)

నిధుల సమీకరణ అంచనా: రూ.7,249.18 కోట్లు

వినియోగం : మూలధన స్థాయి పెంచుకోవడం

సంస్థ వివరాలు..

స్టార్‌ హెల్త్‌ అండ్‌ అలైడ్‌ ఇన్సూరెన్స్‌ను 2006లో స్థాపించారు. భారత్‌లో ప్రముఖ ప్రైవేటు బీమా సంస్థల్లో ఒకటి. 2021 ఆర్థిక సంవత్సరంలో 15.8 శాతం మార్కెట్‌ షేర్‌ను కలిగి ఉంది. ఒక్క ఏడాదిలోనే 2.5 కోట్ల మందికి బీమా పథకాల్ని అందించింది. ముఖ్యంగా రిటైల్‌ హెల్త్‌, గ్రూప్‌ హెల్త్‌, ఫ్యామిలీ హెల్త్‌ విభాగాల్లో మంచి పట్టుంది. దాదాపు 85 శాతం ‘గ్రాస్‌ రిటెన్‌ ప్రీమియం’ వీటి నుంచే వస్తోంది. వ్యక్తిగత ఏజెంట్లతో పాటు కార్పొరేటు ఏజెంట్లు, బ్యాంకు ఏజెంట్ల ద్వారా పాలసీలు పంపిణీ చేస్తోంది. సెప్టెంబరు 31 నాటికి ఈ కంపెనీకి దేశవ్యాప్తంగా 779 శాఖలు ఉన్నాయి. మొత్తం 11,778 ఆసుపత్రులతో దేశంలోనే అతిపెద్ద హాస్పిటల్‌ నెట్‌వర్క్‌ కలిగి ఉంది.

ఆర్థిక వివరాలు(రూ.కోట్లలో)..

సంవత్సరం      2019       2020      2021

ఆదాయం       4,275      5,454       7,405

ఆస్తులు       16,023      15,882      31,440

లాభాలు         128         268       -826

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని