TCS M-Cap: రూ.13.5 లక్షల కోట్ల మైలురాయిని తాకిన టీసీఎస్‌

మార్కెట్‌ విలువ పరంగా రూ.13.5 లక్షల కోట్ల మైలురాయిని అందుకున్న దేశీయ రెండో సంస్థగా టీసీఎస్‌ అవతరించింది. బుధవారం ఇంట్రాడేలో బీఎస్‌ఈలో 2.3 శాతం ఎగబాకిన ఇన్ఫోసిస్‌ షేరు రూ.3,694.25 వద్ద జీవితకాల....

Updated : 25 Aug 2021 12:50 IST

ముంబయి: మార్కెట్‌ విలువ పరంగా రూ.13.5 లక్షల కోట్ల మైలురాయిని అందుకున్న దేశీయ రెండో సంస్థగా టీసీఎస్‌ అవతరించింది. బుధవారం ఇంట్రాడేలో బీఎస్‌ఈలో 2.3 శాతం ఎగబాకిన ఇన్ఫోసిస్‌ షేరు రూ.3,694.25 వద్ద జీవితకాల గరిష్ఠాన్ని తాకడంతో కంపెనీ మార్కెట్‌ విలువ రూ.13.65 లక్షల కోట్లకు చేరింది. గత నెల వ్యవధిలో టీసీఎస్‌ షేర్లు 15 శాతానికి పైగా ఎగిశాయి. మరో మూడు శాతం పెరిగితే.. టీసీఎస్‌ మార్కెట్‌ విలువ రూ.14 లక్షల కోట్ల మైలురాయిని చేరుకుంటుంది. రూ.14.51 లక్షల కోట్లతో మార్కెట్‌ క్యాప్‌ పరంగా ప్రస్తుతం రిలయన్స్‌ తొలిస్థానంలో ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ రూ.8.61 లక్షల కోట్లు, ఇన్ఫోసిస్‌ రూ.7.34 లక్షల కోట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కరోనా తర్వాత వ్యాపారాలన్నీ డిజిటలైజేషన్‌ దిశగా సాగడం, క్లౌడ్‌ సాంకేతికతకు గిరాకీ పుంజుకుంటుండడంతో ఐటీ రంగ షేర్లు రాణిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టీసీఎస్ షేర్ల ర్యాలీ కొనసాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని