TVS: ఆ స్కూటర్‌పై రూ.11వేలు తగ్గింపు

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ తన వాహన శ్రేణిలోని ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఐక్యూబ్‌పై భారీ తగ్గింపు ప్రకటించింది.

Published : 15 Jun 2021 20:33 IST

న్యూదిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ తన వాహన శ్రేణిలోని ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఐక్యూబ్‌పై భారీ తగ్గింపు ప్రకటించింది. తాజాగా ఫేమ్‌-2 (Faster Adoption and Manufacturing of Electric Vehicles in India Phase II) సబ్సిడీని కేంద్రం సవరించింది. ఇందులో భాగంగా ఐక్యూబ్‌పై రూ.11,250 తగ్గిస్తున్నట్లు టీవీఎస్‌ ప్రకటించింది. ప్రస్తుతం దీని ధర ₹.1,12,027 ఉండగా, సవరించిన ధరతో ₹.1,00,777లకే లభించనుంది.

ఇక ఐక్యూబ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఫీచర్ల విషయానికొస్తే, ఒకసారి ఫుల్‌ ఛార్జ్‌ చేస్తే, ఎకో మోడ్‌లో 75 కి.మీ. ప్రయాణించవచ్చు. గంటకు 78కి.మీ. టాప్‌ స్పీడ్‌ను ఐక్యూబ్‌ అందుకోగలదు. ఇందులో 3Li-ion బ్యాటరీ అమర్చారు. 5గంటల్లో 80శాతం ఛార్జ్‌ అయ్యేలా దీన్ని డిజైన్‌ చేశారు. పూర్తి ఛార్జ్‌ చేయడానికి సుమారు 7 గంటల సమయం పడుతుంది. మూడేళ్లు లేదా 50వేల కి.మీ. వరకూ బ్యాటరీపై వారెంటీ ఉంటుంది.

ఇటీవల ఫేమ్‌-2 పథకంలో కేంద్రం కొన్ని సవరణలు చేసింది. ఎలక్ట్రిక్‌ వాహన తయారీదారులకు ప్రస్తుతం 1KWhకు ₹10వేలు చొప్పున ఇస్తున్న సబ్సిడీని ₹15 వేలకు పెంచుతున్నట్లు కేంద్రం పేర్కొంది. వాహనం ఖరీదులో గరిష్ఠంగా 40 శాతం వరకూ ఈ ప్రోత్సాహకాలను అందించనున్నారు. గతంలో ఇది 20 శాతం మాత్రమే ఉండేది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని