Tata Motors: వాణిజ్య వాహనాల ధరలు పెంచిన టాటామోటార్స్‌

టాటామోటార్స్‌ వాణిజ్య వాహనాల ధరలను పెంచింది. ఈ పెంపు అక్టోబర్‌ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఈ విషయాన్ని కంపెనీ మంగళవారం ప్రకటించింది. ముడిపదర్థాల ధరలు పెరడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కంపెనీ పేర్కొంది.

Published : 21 Sep 2021 20:36 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టాటామోటార్స్‌ వాణిజ్య వాహనాల ధరలను పెంచింది. ఈ పెంపు అక్టోబర్‌ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఈ విషయాన్ని కంపెనీ మంగళవారం ప్రకటించింది. ముడిపదార్థాల ధరలు పెరడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కంపెనీ పేర్కొంది. ఇటీవల కాలంలో స్టీలు, విలువైన లోహాల ధరలు పెరుగుతూనే ఉన్నాయి.  ఈ పెరుగుదల సుమారు 2 శాతం వరకు ఉండొచ్చు. మోడల్‌ని బట్టి ఇది మారుతుంటుంది.

టాటామోటార్స్‌ దేశంలోనే వాణిజ్య వాహనాలు తయారు చేసే అతిపెద్ద సంస్థ. ఈ సంస్థ బస్సులు, ట్రక్కులు, తేలికపాటి వాహనాలను ఉత్పత్తి చేస్తుంది. పెరుగుతున్న ధరల ప్రభావాన్ని తట్టుకోవడానికి వీలైనంత తక్కువగానే ధరల పెంపు ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఈ నెల మొదట్లో దేశీయ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ కూడా మరోసారి ధరలను పెంచిన విషయం తెలిసిందే. ఈ పెంపు  వాహనాలను బట్టి 1.9శాతం వరకు ఉంది. వాస్తవానికి మారుతీ ఈ ఏడాది ధరలను మూడుసార్లు పెంచింది. ఇక ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటార్‌ కార్ప్‌ కూడా రూ.3 వేల వరకు ధరను పెంచింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని