Kia Carens: కియా కొత్త కారు ఎలా ఉందో చూశారా?ఎప్పుడు రాబోతోందంటే..
దక్షిణ కొరియా వాహన సంస్థ కియా తమ సరికొత్త మోడల్ ‘కరెన్స్’ను భారతీయ విపణి కోసం గురువారం ఆవిష్కరించింది. 2022 తొలి త్రైమాసికంలో విపణిలోకి ఈ వాహనాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపింది. అధునాత
గురుగ్రామ్: దక్షిణ కొరియా వాహన సంస్థ కియా తమ సరికొత్త మోడల్ ‘కరెన్స్’ను భారతీయ విపణి కోసం గురువారం ఆవిష్కరించింది. 2022 తొలి త్రైమాసికంలో విపణిలోకి ఈ వాహనాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపింది. అధునాత డిజైన్, హైటెక్ ఫీచర్లు, ఉన్నత భద్రతా వ్యవస్థ కలగలిపిన ఈ మోడల్‌ను రిక్రియేషనల్ వెహికల్‌గా (ఆర్వీ) కంపెనీ అభివర్ణిస్తోంది. కుటుంబ వాహనాల్లో కొత్త విభాగంగా, పరిశ్రమలో సరికొత్త ప్రమాణాలను సృష్టిస్తుందని కియా కార్పొరేషన్ ప్రెసిడెంట్, సీఈఓ హో సంగ్ సాంగ్ వెల్లడించారు. పెట్రోల్, డీజిల్ పవర్ట్రెయిన్లలో 7-స్పీడ్ డీసీటీ, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లతో, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఆల్-వీల్ డిస్క్ బ్రేకుల వంటి సదుపాయాలు ఈ మోడల్ సొంతమన్నారు. విద్యుత్ కార్ల ప్రణాళికను వచ్చే ఏడాది ప్రకటిస్తామని వెల్లడించారు.
అత్యుత్తమ భద్రతా ప్రమాణాలు..
మొత్తం 10 భద్రతా ఫీచర్లతో కుంటుంబం మొత్తానికి రక్షణ కల్పించనుంది. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్, ఈఎస్సీ, హెచ్ఏసీ, వీఎస్ఎం, డీబీసీ, బీఏఎస్, ఆల్-వీల్ బ్రేక్స్, టీపీఎంఎస్ హైలైన్ అండ్ రేర్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. ఇవి అన్ని కరెన్స్ వేరియంట్లలో అందుబాటులో ఉండడం విశేషం.
26.3 సెం.మీ హెచ్డీ టచ్‌స్క్రీన్..
మొత్తం 60+ కనెక్టింగ్ ఫీచర్లతో భద్రతతో కూడిన అనుసంధానాన్ని అందిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్‌జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం