TikTok: పాకిస్థాన్‌లో టిక్‌టాక్‌పై నిషేధం ఎత్తివేత

ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన ప్రముఖ వీడియో షేరింగ్‌ యాప్‌ టిక్‌టాక్‌పై విధించిన నిషేధాన్ని పాకిస్థాన్ ఎత్తివేసింది....

Updated : 20 Nov 2021 13:22 IST

ఇస్లామాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన ప్రముఖ వీడియో షేరింగ్‌ యాప్‌ టిక్‌టాక్‌పై విధించిన నిషేధాన్ని పాకిస్థాన్ ఎత్తివేసింది. ఈ యాప్‌లో అనుచిత సమాచారం వ్యాప్తి అవుతోందన్న ఆరోపణల నేపథ్యంలో గత జులై 20న నిషేధం విధించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కావని హామీ ఇవ్వడంతో టిక్‌టాక్‌పై నిషేధం ఎత్తివేస్తున్నామని పాకిస్థాన్‌ టెలికమ్యూనికేషన్‌ అథారిటీ(పీటీఏ) ప్రకటించింది. అనైతిక, అనుచిత సమాచారం ఇకపై వ్యాప్తి కాబోదని.. అందుకు పటిష్ఠ చర్యలు చేపడతామని టిక్‌టాక్ హామీ ఇచ్చినట్లు తెలిపింది. ఈ యాప్‌పై పాక్‌ నిషేధం విధించి ఎత్తివేయడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. భారత్‌లోనూ టిక్‌టాక్‌పై నిషేధం కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని