Term insurance: ₹ కోటి ట‌ర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌కు ప్రీమియం ఎంత?

ట‌ర్మ్ బీమా పాల‌సీలో ప్రీమియం త‌క్కువ ఉండి ఎక్కువ బీమా ర‌క్ష‌ణ అవ‌కాశం ఉంటుంది.

Updated : 10 Nov 2021 15:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆర్థిక బాధ్యతలు ఉండే వారికి జీవిత బీమా చాలా అవసరం. సాధార‌ణ ఎండోమెంట్ పాల‌సీలు ఎక్కువ ప్రీమియం క‌లిగి ఉండి, త‌క్కువ ఆర్థిక భద్రతను ఇస్తాయి. అందుచేత వీరు ట‌ర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను కొనుగోలు చేయ‌డం ముఖ్యం. ట‌ర్మ్ బీమా పాల‌సీలో ప్రీమియం త‌క్కువ ఉండి ఎక్కువ బీమా రక్షణ ఇస్తుంది. ఈ ట‌ర్మ్ ఇన్సూరెన్స్ పాల‌సీ కొనుగోలు చేయ‌డం ఒక విధానంగా ఉండాలి. కేవ‌లం తాత్కాలిక ప్రాతిప‌దిక‌న బీమా క‌వ‌ర్‌ను కొనుగోలు చేయ‌డం స‌రికాదు. ఆదాయం సంపాదించే వ్యక్తి ఏ కారణం చేత‌నైనా మ‌ర‌ణించిన సంద‌ర్భంలో వారిపై ఆధార‌ప‌డిన వారు మిగిలిన జీవ‌న ప్రయాణాన్ని కొన‌సాగించ‌డానికి కుటుంబానికి త‌గినంత డ‌బ్బు అందించ‌డం టర్మ్‌ పాలసీ ముఖ్య ఉద్దేశం. చాలా మందికి గృహ కొనుగోలు, పిల్లల చదువులు, వివాహం మొద‌లైన వివిధ ల‌క్ష్యాలు, బాధ్యతలు ఉంటాయి. వీటిని అమ‌లు చేయ‌డానికి గ‌ణ‌నీయ‌మైన నిధులు అవ‌స‌రం.

ఒక వ్యక్తి తన సంవత్సర ఆదాయానికి 10-15 రెట్లు ట‌ర్మ్ ఇన్సూరెన్స్ క‌వ‌రేజీని క‌లిగి ఉండాలి. మీరు ట‌ర్మ్ ఇన్సూరెన్స్ పాల‌సీని కొనుగోలు చేసిన త‌ర్వాత‌ అవ‌స‌రాలు మారొచ్చు. కాబ‌ట్టి క‌నీసం 5 ఏళ్లకోసారి అవ‌స‌రాల‌ను స‌మీక్షించుకోవాలి. మీరు ఒక‌టి లేదా అంత‌కంటే ఎక్కువ బీమా సంస్థల నుంచి ఆన్‌లైన్‌లో ట‌ర్మ్ ఇన్సూరెన్స్ పాల‌సీల‌ను కొనుగోలు చేయొచ్చు. ఆన్‌లైన్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు, ఆఫ్‌లైన్ ప్లాన్‌ల కంటే త‌క్కువ ఖ‌ర్చుతో అందుబాటులో ఉంటాయి. మీకు ఉండే ఆర్థిక బాధ్యతలను బట్టి విభిన్నమైన క‌వ‌రేజీతో ఒక‌టి కంటే ఎక్కువ ట‌ర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ల‌ను కూడా కొనుగోలు చేయ‌డం మంచిది. ఒక‌టి క‌న్నా ఎక్కువ పాల‌సీలు కొనుగోలు చేసినట్లయితే ఆర్థిక బాధ్యతలు తగ్గినప్పుడు ఒక‌దాన్ని వ‌దులుకోవ‌చ్చు. ద‌ర‌ఖాస్తు ఫార‌ం పూర్తిచేసేటప్పుడు ఇంత‌కు ముందు ఉన్న పాలసీల వివరాలను వెల్లడించాలి.

35 సంవ‌త్సరాల కాలవ్యవధికి కోటి రూపాయల హామీ మొత్తానికి 25 ఏళ్ల జీతం పొందే పురుషుడికి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచిన వివిధ సంస్థల పాల‌సీల‌ వార్షిక ప్రీమియం (18 శాతం జీఎస్టీ కలిపి) వివరాలను దిగువ ఇస్తున్నాం.

నోట్‌: ట‌ర్మ్ ప్లాన్ ప్రీమియంలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. సంబంధిత వైబ్‌సైట్‌ల‌ను సంద‌ర్శించి ప్రీమియం తెలుసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని