Yamaha FZ X: సరికొత్త డిజైన్‌తో ఎఫ్‌జెడ్‌ ఎక్స్‌..!

యమహా ఇండియా భారత్‌లోకి సరికొత్తడిజైన్‌తో ఎఫ్‌జెడ్‌-ఎక్స్‌ను విడుదల చేసింది. దీనిలో రెండు వేరియంట్లు అందుబాటులో ఉండనున్నాయి. ఈ బైక్‌లో స్మార్ట్‌ ఫోన్లకు

Published : 18 Jun 2021 21:34 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: యమహా ఇండియా భారత్‌లోకి సరికొత్త డిజైన్‌తో ఎఫ్‌జెడ్‌-ఎక్స్‌ను విడుదల చేసింది. దీనిలో రెండు వేరియంట్లు అందుబాటులో ఉండనున్నాయి. ఈ బైక్‌లో స్మార్ట్‌ ఫోన్లకు అనుసంధానించేలా వై కనెక్ట్‌ యాప్‌ ఉంది. స్టాండర్డ్‌ వేరియంట్‌ ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.1,16,800గా నిర్ణయించారు. స్మార్ట్‌ఫోన్‌ను అనుసంధానించే ఫీచర్‌ ఉన్న వేరియంట్‌ ధర రూ.1,19,800గా కంపెనీ పేర్కొంది. దీనిలో ఇన్‌కమింగ్‌ కాల్స్‌ అలర్ట్స్‌, ఎస్‌ఎంఎస్‌ అలర్ట్‌, బ్యాటరీ ఛార్జింగ్‌ ఇండికేటర్‌, ఇంధన వినియోగం, మాల్‌ఫంక్షన్‌ అలర్ట్‌ వంటివి ఉన్నాయి. ఈ నెలలోనే  బైక్‌ డెలివరీలను మొదలు పెట్టనున్నారు. 

ఈ బైక్‌కు స్టాండర్డ్‌ ఇంజిన్‌ బాష్‌ ప్లేట్‌ను అమర్చారు. ఎల్‌ఈడీ హెడ్‌లైట్స్‌, ఎల్‌ఈడీ టెయిల్‌ లైట్స్‌ ఉన్నాయి. 149 సీసీ సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌ను బిగించారు. ఇది 12.4 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. ఈ బైక్‌ బరువు 139 కిలోలు. దీనిని నియో-రెట్రో మోడల్లో డిజైన్‌ చేశారు. మార్కెట్‌ సర్వే నిర్వహించి వినియోగదారుల అభిరుచులకు తగినట్లు డిజైన్‌లో మార్పులు చేసినట్లు యమహా ఇండియా పేర్కొంది.  ఈ బైక్ బుకింగ్‌, కొనుగోలుకు ఆన్‌లైన్‌ సౌకర్యం కూడా అందుబాటులోకి తెచ్చింది. బైక్‌ను ఇంటివద్ద డెలివరీ చేస్తారని కంపెనీ పేర్కొంది. సుదూర ప్రయాణాలకు, పట్టణ రహదారులకు ఈ బైక్‌ అనుకూలంగా ఉంటుందని  కంపెనీ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని