Health Insurance: సీనియ‌ర్ సిటిజ‌న్ల‌ కోసం ఆదిత్య బిర్లా కొత్త ఆరోగ్య బీమా ప్లాన్

వ్య‌క్తిగ‌తంగా లేదా జీవిత భాగస్వామి కోసం ఈ ప్లాన్‌ను కొనుగోలు చేయవచ్చు.

Updated : 30 Aug 2022 15:25 IST


ఆదిత్య బిర్లా క్యాపిటల్‌కు చెందిన ఆదిత్య బిర్లా ఆరోగ్య బీమా సంస్థ‌.. యాక్టీవ్ హెల్త్ ఎస‌న్షియ‌ల్ పేరుతో కొత్త ప్లాను ప్రారంభించింది. సీనియ‌ర్ సిటిజ‌న్ల ప్ర‌త్యేక‌ ఆరోగ్య అస‌వ‌రాలు దృష్టిలో ఉంచుకుని రూపొందించిన హెల్త్ సొల్యుష‌న్ ప్లాన్‌ ఇది.

బీమా సంస్థ విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న ప్ర‌కారం, యాక్టివ్ హెల్త్ ఎసెన్షియల్ ప్లాన్.. మొద‌టి రోజు నుంచి క్రానిక్ మేనేజ్‌మెంట్ క‌వ‌రేజ్ ప్రొగ్రామ్‌తో స‌మ‌గ్ర ఆరోగ్య బీమా ప‌రిష్కారాన్ని అందిస్తుంది. అంటే..ఇప్ప‌టికే ఉన్న అనారోగ్య ప‌రిస్థితుల‌ను మొద‌టి రోజు నుంచి ఈ ప్లాన్ క‌వ‌ర్ చేస్తుంది. వ్యాధి త‌ర్వాతి ద‌శ‌ల‌ను చేరుకుంటే..అద‌న‌పు ఖ‌ర్చులు లేకుండా పాల‌సీ క‌వ‌ర్ చేస్తుంది. ఇలాంటి కేసుల‌ను క‌వ‌ర్ చేసే పాల‌సీలు సాధార‌ణంగా 20 శాతం త‌ప్ప‌నిస‌రి స‌హ‌-చెల్లింపు(కో-పేమెంట్‌) ఆప్ష‌న్‌తో వ‌స్తాయి. అయితే, అద‌న‌పు ప్రీమియం చెల్లించ‌డం ద్వారా స‌హా చెల్లింపులు లేకుండా పాలసీ పూర్తి క‌వ‌రేజ్ పొందే అవ‌కాశం ఈ ప్లాన్‌లో అందుబాటులో ఉంది. 

ఈ రోజుల్లో చాలా మంది సీనియర్ సిటిజన్లు ఆరోగ్యానికి అధిక ప్రాధాన్య‌త ఇస్తున్నారు. వాకింగ్‌, యోగా వంటివి చేస్తూ వారి ఫిట్‌నెస్‌ను కాపాడుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ సంవత్సరంలో 275 రోజులు యాక్టివ్ (యోగా, వాకింగ్ వంటి ఫిట్‌నెస్‌ ప్రోగ్రామ్‌ల‌లో పాల్గొంటూ చురుకుగా ఉండ‌డం) ఉంటే, వారికి ప్రీమియంలో 50 శాతం వరకు హెల్త్ రిట‌ర్న్స్‌ పొందేందుకు అర్హ‌త ల‌భిస్తుంది. దీని ద్వారా ఏదైనా ఆరోగ్య ఖర్చుల రీయింబర్స్‌మెంట్ లేదా వార్షిక పునరుద్ధరణ ప్రీమియం చెల్లింపుల‌ తగ్గింపుతో పాటు మ‌రిన్ని ప్ర‌యోజ‌నాలు పొందవచ్చు. ఈ పాల‌సీ మానసిక అనారోగ్యం, ఇంటి చికిత్సలను కూడా కవర్ చేస్తుంది.

కోవిడ్-19 పెద్ద‌ల‌పై ఎక్కువ ప్ర‌భావాన్ని చూపించింది. ఒక స‌ర్వే ప్ర‌కారం 26 శాతం సీనియ‌ర్ సిటిజ‌న్లు కోవిడ్-19 కార‌ణంగా ఇత‌ర ఆరోగ్య స‌మ‌స్య‌ల‌కు గుర‌య్యారు. స‌రైన అవగాహన లేక‌పోవ‌డం, నానాటికి పెరుగుతున్న వైద్య చికిత్స ఖ‌ర్చుల కార‌ణంగా చాలా కుటుంబాల‌పై ఆర్థిక భారం ప‌డుతుంది. దీని కారణంగా వ‌యోవృద్ధుల కోసం స‌ర‌స‌మైన ధ‌ర‌లో ఆరోగ్య బీమాను అందుబాటులో తీసుకొచ్చిన‌ట్లు సంస్థ తెలిపింది. 

యాక్టివ్ హెల్త్ ప్లాటిన‌మ్ ఎసెన్షియ‌ల్ ప్లాన్ ఫీచ‌ర్లు..
*
 మానసిక అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరితే పాల‌సీ క‌వ‌ర్ చేస్తుంది. 
*  మీ ఆరోగ్య ప్రయాణంలో సహాయ ప‌డేందుకు నిపుణులైన హెల్త్‌ కోచ్ అందుబాటులో ఉంటారు
*  చెల్లించిన ప్రీమియంలో గ‌రిష్టంగా 50 శాతం వ‌ర‌కు హెల్త్ రిట‌ర్నులు పొందచ్చు. దీన్ని వార్షిక ప్రీమియం లో తగ్గింపు కోసం లేదా ఇతర ఆరోగ్య ఖర్చుల రి-ఇంబర్సమెంట్ కోసం ఉపయోగించుకోవచ్చు.
* త‌ప్ప‌నిస‌రి స‌హ చెల్లింపుల నుంచి మిన‌హాయింపు పొందే అవ‌కాశం ఉంది. ఇది ఆప్ష‌న‌ల్.. పాల‌సీదారుడు త‌మ ఇష్టం మేర‌కు తీసుకోవ‌చ్చు. (సాధార‌ణంగా పెద్దల పాలసీలకి హామీ మొత్తంలో 20 శాతం త‌ప్ప‌నిస‌రి స‌హా చెల్లింపులు ఉంటాయి.)
* విస్తృతస్థాయి 9000+ నెట్‌వర్క్ ఆసుప‌త్రులలో ఇన్-పేషెంట్ ఆసుప‌త్రి సేవ‌లు న‌గ‌దు ర‌హిత క‌వ‌రేజ్‌తో అందుబాటులో ఉన్నాయి. 
* 30 రోజుల ప్రీ-హాస్ప‌టలైజేష‌న్ ఖ‌ర్చుల‌ను, 60 రోజుల పోస్ట్‌-హాస్ప‌టలైజేష‌న్ ఖ‌ర్చుల‌ను కవర్ చేస్తుంది.
* ఆయుష్ కవర్, ఊబకాయం, ఆధునిక చికిత్సా పద్ధతులకు క‌వ‌రేజ్ ఉంటుంది. 
* 24 గంటల కంటే ఎక్కువ స‌మ‌యం ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేని, జాబితాలో పేర్కొన్న‌ 586 డేకేర్ విధానాలను కవర్ చేస్తుంది.
* నగదు రహిత గృహ చికిత్సల ప్రయోజనం అందుబాటులో ఉంది.

వ్య‌క్తిగ‌తంగా లేదా ఫ్యామిలీ ఫ్లోట‌ర్ (స్వీయ, జీవిత భాగస్వామికి మాత్రమే) పాల‌సీగా కొనుగోలు చేయవచ్చు. వ్య‌క్తులు వారి అవసరాలకు అనుగుణంగా కొనుగోలు చేసేందుకు విస్తృత శ్రేణిలో హామీ మొత్తం అందించే ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని