Air India: ₹3,297 కోట్లతో ఎయిరిండియా విమానాలకు కొత్తరూపు

Air India: తమ సంస్థలో ఉన్న పెద్ద విమానాలను పూర్తిగా మెరుగుపర్చాలని ఎయిరిండియా నిర్ణయించింది. అందుకోసం భారీ ఎత్తున నిధుల్ని కేటాయించనుంది. ఈ పనిని లండన్‌ కేంద్రంగా పనిచేస్తున్న రెండు కంపెనీలకు అప్పగించింది.

Published : 08 Dec 2022 22:37 IST

ముంబయి: దేశీయ విమానయాన దిగ్గజ సంస్థ ఎయిరిండియా మరో కీలక నిర్ణయం తీసుకుంది. సుదీర్ఘకాలంగా సంస్థలో ఉన్న పెద్ద విమానాలను పూర్తిగా మెరుగుపరచాలని నిర్ణయించింది. అందుకోసం 400 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.3,297.26 కోట్లు) వెచ్చించనున్నట్లు తెలిపింది. 28 బోయింగ్‌ బీ787-8, 13 బీ777 విమానాల లోపలి భాగం డిజైన్‌ను పూర్తిగా మార్చనున్నట్లు పేర్కొంది. అందులో భాగంగా కొత్తతరం సీట్లను అమర్చనున్నట్లు తెలిపింది. అలాగే అత్యంత ఆధునిక ఎంటర్‌టైన్‌మెంట్‌ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. వీటితో పాటు కొత్తగా ప్రీమియం ఎకానమీ అనే సరికొత్త క్యాబిన్‌ను తీసుకురానున్నట్లు తెలిపింది. బీ777లో ఫస్ట్‌ క్లాస్‌ క్యాబిన్‌ను కూడా కొనసాగిస్తామని పేర్కొంది. ఈ ప్రాజెక్టును లండన్‌ కేంద్రంగా పనిచేస్తున్న డిజైన్‌ కంపెనీలు జేపీఏ డిజైన్‌, ట్రెండ్‌వర్క్స్‌కు అప్పగించినట్లు ఎయిరిండియా తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని