Airtel 5g: నెల రోజుల్లోనే 10 లక్షల మందికి 5జీ.. ఎయిర్‌టెల్‌ మైలురాయి

దేశంలో 5జీ సేవలను ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే ఎయిర్‌టెల్‌ ఓ మైలురాయిని చేరుకుంది. తమ 5జీ సేవల్లో 10 లక్షల మంది యునిక్‌ యూజర్లు భాగమైనట్లు ఎయిర్‌టెల్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

Updated : 25 Mar 2023 16:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో 5జీ సేవలను ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే ఎయిర్‌టెల్‌ ఓ మైలురాయిని చేరుకుంది. తమ 5జీ సేవల్లో 10 లక్షల మంది యునిక్‌ యూజర్లు భాగమైనట్లు ఎయిర్‌టెల్‌ ఓ ప్రకటనలో తెలిపింది. 5జీ సేవలను ప్రారంభించిన నెల రోజుల్లోపే ఈ ఘనతను సాధించినట్లు కంపెనీ పేర్కొంది. హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు, సిలిగుడి, నాగ్‌పూర్‌, వారణాశి నగరాల్లో 5జీ ప్లస్‌ పేరిట ఎయిర్‌టెల్‌ 5జీ సేవలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆయా నగరాల్లో దశలవారీగా నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్నారు. ఈ క్రమంలోనే 10 లక్షలమంది తమ 5జీ నెట్‌వర్క్‌ను వినియోగిస్తున్నట్లు ఎయిర్‌టెల్‌ పేర్కొంది.

ఎయిర్‌టెల్‌ 5జీ సేవలనూ ప్రస్తుతం ప్రతిరోజూ విస్తరిస్తూ ముందుకెళుతున్నామని ఆ కంపెనీ సీటీఓ రణ్‌దీప్‌ సెకాన్‌ తెలిపారు. కొన్ని డివైజులు మినహాయిస్తే దాదాపు అన్ని పరికరాల్లో తమ 5జీ నెట్‌వర్క్‌ అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. దేశవ్యాప్తంగా సేవలందించేందుకు వేగంగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. సేవలను ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే ఈ స్థాయిలో స్పందన రావడం తమకు ప్రోత్సాహకరంగా ఉందని తెలిపారు. మరోవైపు ఇప్పుడున్న ప్లాన్లతోనే హైస్పీడ్‌ 5జీ సేవలను ఆనందించొచ్చని కంపెనీ చెబుతోంది. ఇందుకోసం సిమ్‌ కార్డు సైతం మార్చాల్సిన అవసరం లేదని తెలిపింది. కేవలం 5జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్‌ చేసే మొబైల్‌ ఉంటే సరిపోతుందని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని