అసెట్ అలోకేష‌న్ ఫండ్లంటే...

ఈక్విటీ, స్థిరాదాయ పెట్టుబ‌డి మార్గాల్లో మార్పులు చేర్పులు చేస్తూ పెట్టుబ‌డిచేసే ఫండ్ల‌ను అసెట్ అలోకేష‌న్ ఫండ్లు అంటారు....

Published : 18 Dec 2020 17:17 IST

ఈక్విటీ, స్థిరాదాయ పెట్టుబ‌డి మార్గాల్లో మార్పులు చేర్పులు చేస్తూ పెట్టుబ‌డిచేసే ఫండ్ల‌ను అసెట్ అలోకేష‌న్ ఫండ్లు అంటారు.

మార్కెట్లో వ‌చ్చే ఒడుదొడుకుల‌ను ఎదుర్కునేందుకు పోర్టుఫోలియోలో పెట్టుబ‌డుల‌ను స‌రిదిద్దే ఫండ్ల‌ను అసెట్ అలోకేష‌న్ ఫండ్లు అంటారు. ఈక్విటీలో రాబ‌డి మంద‌గ‌మించిన‌పుడు డెట్ లోకి , వ‌డ్డీరేట్లు త‌గ్గితే డెట్ అనుకూలంగా ఉండ‌దు కాబ‌ట్టి ఈక్విటీలోకి పెట్టుబ‌డుల‌ను మారుస్తుంటారు. అయితే వీటి ప‌నిత‌నం ఫండ్ మేనేజ‌ర్ నిర్ణ‌యాల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. వీటిలో రెండుర‌కాలు ఉంటాయి.

డైన‌మిక్ అసెట్ అలోకేష‌న్ లేదా బ్యాలెన్సెడ్ అడ్వాన్టేజ్ ఫండ్

ఈక్విటీ, స్థిరాదాయ పెట్టుబ‌డి మార్గాల్లో క్రీయాశీల‌ వ్యూహంతో మ‌దుపు చేసే ఫండ్ల‌ను డైన‌మిక్ అసెట్ అలోకేష‌న్ ఫండ్లు అంటారు.

మ‌ల్టీ అసెట్ అలోకేష‌న్ ఫండ్

క‌నీసం మూడు ర‌కాల అసెట్ వ‌ర్గాల్లో పెట్టుబ‌డి చేయాలి. ఒక్కో దాంట్లో క‌నీసం 10శాతం పెట్టుబ‌డి చేయాలి. ఇందులో విదేశీ పెట్టుబ‌డున‌లు వేరే అసెట్ వ‌ర్గం కింద ప‌రిగ‌ణించ‌రు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని