Bank of Baroda: అన్ని రకాల చెల్లింపులకు ఒకే కార్డ్‌..

Bank of Baroda: ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా.. బ్యాంక్‌ నేషనల్‌ కామన్‌ మొబిలిటీ కార్డ్‌ను ప్రవేశపెట్టింది. ఈ విషయాన్ని మంగళవారం వెల్లడించింది.

Published : 03 Jan 2024 01:58 IST

Bank of Baroda | ఇంటర్నెట్‌డెస్క్‌: అన్ని రకాల చెల్లింపులకు ఒకే కార్డు ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (Bank of Baroda) కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్‌ కామన్‌ మొబిలిటీ కార్డ్‌ (NCMC) రూపే రీలోడబుల్‌ ప్రీపెయిడ్‌ కార్డ్‌ను తీసుకొచ్చింది. ఈ విషయాన్ని బీఓబీ మంగళవారం ప్రకటించింది. ‘వన్‌ నేషన్‌, వన్‌ కార్డ్‌’ చొరవతోనే దీన్ని తీసుకొచ్చినట్లు పేర్కొంది.

బీఓబీ తీసుకొచ్చిన ఎన్‌సీఎమ్‌సీతో మెట్రో, బస్సు, రైలు, క్యాబ్ ప్రయాణాల టికెట్లను కొనుగోలు చేయొచ్చు. టోల్‌, పార్కింగ్‌ లాంటి సమయంలోనూ ఈ కాంటాక్ట్‌లెస్‌ ప్రీపెయిడ్‌ కార్డ్‌ ఉపయోగపడుతుందని బ్యాంక్‌ తెలిపింది. ఏటీఎం విత్‌డ్రాతో పాటూ POS (పాయింట్ ఆఫ్ సేల్), ఈ-కామర్స్ చెల్లింపుల కోసం కూడా ఈ కార్డును ఉపయోగించవచ్చని ప్రకటించింది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కస్టమర్లకే కాకుండా ఇతరులు కూడా రియల్‌టైమ్‌ వినియోగం కోసం వెంటనే యాక్టివేట్‌ చేయించుకోవచ్చని పేర్కొంది.

గూగుల్‌ మ్యాప్స్‌ కొత్త ఫీచర్‌.. వాట్సాప్‌ లేకుండానే రియల్‌ టైమ్‌ లొకేషన్‌ షేర్‌..

ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ లావాదేవీలకు ఈ కార్డ్‌ సపోర్ట్‌ చేస్తుందని బీఓబీ తెలిపింది. ఆన్‌లైన్‌ వాలెట్ బ్యాలెన్స్‌ గరిష్ఠంగా రూ.లక్ష వరకు, ఆఫ్‌లైన్‌ వాలెట్‌లో అయితే రూ.2వేలుగా పరిమితిని నిర్ణయించింది. బ్యాంక్‌ ప్రత్యేక పోర్టల్‌ ద్వారా కార్డు దారులు డబ్బును లోడ్‌/రీలోడ్‌ చేసుకోవచ్చు. ఈ కార్డుకు సంబంధించిన అన్ని లావాదేవీలు రిజిస్టర్‌ మొబైల్‌ నెంబర్‌కు ఎస్సెమ్మెస్‌ రూపంలో అందుతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని