Bank of baroda: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా @ రూ.1 లక్ష కోట్లు

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎస్‌బీఐ తర్వాత బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా అత్యంత విలువైన బ్యాంకుగా అవతరించింది.

Published : 19 Jun 2023 19:08 IST

దిల్లీ: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా రూ.1 లక్ష కోట్ల మార్కెట్‌ క్యాప్‌ను తాకింది. ఎస్‌బీఐ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ప్రభుత్వ రంగ బ్యాంకుగా అవతరించింది. ఎస్‌బీఐ షేర్‌ ధర ప్రకారం సుమారు రూ.5.07 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాప్‌ను కలిగి ఉంది. భారత్‌లో మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ప్రకారం..  హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అత్యంత విలువైన భారతీయ బ్యాంకుగా కొనసాగుతోంది. తర్వాత వరుసగా ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్‌బీఐ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంకు ఉన్నాయి.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మార్కెట్‌ క్యాప్‌ పరంగా దాదాపు రూ.9 లక్షల కోట్ల విలువతో అత్యంత విలువైన భారతీయ బ్యాంక్‌గా నిలిచింది. ఐసీఐసీఐ బ్యాంకు నికర విలువ రూ.6.44 లక్షల కోట్లతో రెండో అత్యంత విలువైన భారతీయ బ్యాంక్‌గా ఉంది. సుమారు రూ.5.07 లక్షల కోట్ల మార్కెట్‌ విలువతో ఎస్‌బీఐ మూడో అత్యంత విలువైన బ్యాంకు. కోటక్‌ మహీంద్రా బ్యాంకు, యాక్సిస్‌ బ్యాంకులు వరుసగా రూ.3.63 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాప్‌, 2.98 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాప్‌తో ఎస్‌బీఐ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ప్రకారం భారతీయ కంపెనీల జాబితాలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ రూ.17.29 లక్షల కోట్లతో ఇప్పటికీ మొదటి స్థానంలో ఉంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ పరంగా రెండో అత్యంత విలువైన భారతీయ కంపెనీగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని