పండుగ వేళ‌ మోసపోకండి..

దీపావళి పండుగకి కేవలం కొద్దీ రోజుల సమయం మాత్రమే ఉంది. ఇన్ని రోజులు మీరు పొదుపు చేసుకున్న డబ్బును ఈ పండగ రోజున ఖర్చు చేయాలని భావించవచ్చు. అయితే కొందరు మోసగాళ్లు మీ డబ్బును దొంగిలించే అవకాశం ఉంది. మీరు బ్యాంకు లావాదేవీలను ఎలా నిర్వర్తిస్తున్నారనే దానిపై జాగ్రత్త వహించాలి. లేకపోతే మీకు మీరుగా మోసపోవాల్సి వస్తుంది..

Published : 16 Dec 2020 19:27 IST

దీపావళి పండుగకి కేవలం కొద్దీ రోజుల సమయం మాత్రమే ఉంది. ఇన్ని రోజులు మీరు పొదుపు చేసుకున్న డబ్బును ఈ పండగ రోజున ఖర్చు చేయాలని భావించవచ్చు. అయితే కొందరు మోసగాళ్లు మీ డబ్బును దొంగిలించే అవకాశం ఉంది. మీరు బ్యాంకు లావాదేవీలను ఎలా నిర్వర్తిస్తున్నారనే దానిపై జాగ్రత్త వహించాలి. లేకపోతే మీకు మీరుగా మోసపోవాల్సి వస్తుంది.

ప్రస్తుత రోజుల్లో నేరపూరిత ధోరణి వేగంగా పెరుగుతుంది. ఇది మీ ఖాతాలకు సంబంధించిన రహస్య వివరాలను వెల్లడించేలా దారి తీస్తుంది. బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నట్లుగా మోసగాళ్లు కాల్ చేసి, మిమ్మల్ని నమ్మించి, ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ (ఐవీఆర్) సిస్టమ్ పై కార్డ్ నంబర్, పిన్, సీవీవీ వంటి మీ రహస్య వివరాలను నమోదు చేయాల్సిందిగా కోరవచ్చు లేదా మీ క్రెడిట్ / డెబిట్ కార్డును ధృవీకరించే సాకుతో వివరాలను అడిగి మిమ్మల్ని మోసం చేయవచ్చు.

ఇలాంటి వారు ఈ దీపావళి పండగను ఒక గొప్ప అవకాశంగా భావించి, మీ డబ్బును దొంగలించడానికి లాభదాయకమైన మార్గాన్ని కనుగొన్నారు. వారు మీకు కాల్ చేసి, మీ గత క్రెడిట్ కార్డు లావాదేవీలకు గాను బ్యాంకు మీకు కొన్ని బహుమతులను పంపిస్తుందని చెప్తారు. మీరు కార్డు యజమాని అవునో కాదో ధ్రువీకరించుకోవడం కోసం మిమల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతారు. అనంతరం మీ కార్డు వివరాలను అడుగుతారు. ఒకవేళ మీరు బహుమతుల కోసం మీ కార్డు వివరాలను వెల్లడించినట్లైతే, అతను మీ కార్డు లేదా బ్యాంకు ఖాతా నుంచి వెంటనే డబ్బును దొంగిలిస్తాడు.

ఒకవేళ మీరు అటువంటి కాల్స్ ను పొందినట్లైతే, మీ వివరాలను షేర్ చేయకూడదని గుర్తుంచుకోండి. అలాగే, ఈ విషయానికి సంబంధించి మీ బ్యాంకుకు లేదా సమీపంలోని పోలీసు స్టేషన్ కు సమాచారం ఇవ్వండి.

ఇటీవలే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటువంటి మోసాలపై జాగ్రత్త వహించాల్సిందిగా తన వినియోగదారులను హెచ్చరించింది. లావాదేవీల సమయంలో చేయాల్సిన, చేయకూడని విషయాల గురించి ఎస్బీఐ తయారు చేసిన జాబితాను ఒకసారి పరిశీలిస్తే…

చేయాల్సినవి :

  • సురక్షితమైన బ్రౌజర్లను మాత్రమే ఉపయోగించండి.
  • చెల్లింపులు చేసేటప్పుడు ‘https’ తో మొదలయ్యే వెబ్సైట్లను ఉపయోగించండి.
  • తెలిసిన లబ్ధిదారులకు మాత్రమే డబ్బును బదిలీ చేయండి.
  • డెబిట్ / క్రెడిట్ కార్డు లావాదేవీ మొత్తాన్ని సరిచూసుకోండి.

చేయకూడనివి :

  • పబ్లిక్ డివైజ్లు లేదా ఓపెన్ ఫ్రీ నెట్వర్క్ ల ద్వారా లావాదేవీలు చేయడం.
  • ఓటీపీ, పిన్, సీవీవీ, యూపీఐ పిన్ వంటి వాటిని షేర్ చేయడం.
  • మీ ఫోన్లో బ్యాంకింగ్ ఆధారాలను సేకరించడం.
  • మీ కార్డు వివరాలను ఇతరులతో పంచుకోవడం.

మీరు గుర్తుంచుకోవాల్సిన కొన్ని ఇతర అంశాలు:

  • ప్రతి లావాదేవీకి సంబంధించిన సమాచారం మీ మొబైల్ కి వచ్చేలా చూసుకోండి.
  • ఒకవేళ మీరు దేనినైనా మోసపూరిత లావాదేవిగా అనుమానిస్తే, దానిని బ్యాంకుతో తనిఖీ చేసి, ఆ విషయాన్ని పోలీసులకు తెలియజేయండి.
  • మెసేజ్ లేదా మెయిల్ ద్వారా అందుకున్న అనుమానాస్పద లింక్ లపై క్లిక్ చేయకండి.
  • మీకు తెలియని లేదా అనుమానాస్పద ఫైల్స్ ను డౌన్లోడ్ చేయకండి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని