CBI: గెయిల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ను అరెస్ట్‌ చేసిన సీబీఐ

CBI arrests GAIL Executive Director: లంచం తీసుకున్నట్లుగా వచ్చిన ఆరోపణల నేపథ్యంలో గెయిల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు

Published : 05 Sep 2023 16:55 IST

దిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ గెయిల్‌ (GAIL) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కె.బి.సింగ్‌ను సీబీఐ (CBI) అరెస్ట్‌ చేసింది. రూ.50 లక్షలు లంచం తీసుకున్నట్లుగా వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయన్ని అదుపులోకి తీసుకుంది. గ్యాస్‌ పైప్‌లైన్‌ ప్రాజెక్టుల కేటాయింపులో కొంతమంది కాంట్రాక్టర్లకు మేలు చేయడం కోసం ఆయన ముడుపులు స్వీకరించారనే ఆరోపణలు ఉన్నాయి.

కె.బి.సింగ్‌తో పాటు మరో నలుగురిని కూడా అరెస్ట్‌ చేసినట్లు సీబీఐ (CBI) అధికారులు తెలిపారు. వీరిలో వడోదర కేంద్రంగా పనిచేస్తున్న అడ్వాన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ డైరెక్టర్‌ సురేందర్‌ కుమార్‌ కూడా ఉన్నారు. శ్రీకాకుళం నుంచి అంగుల్‌, విజయ్‌పూర్‌ నుంచి ఔరైయా వరకు వేస్తున్న పైప్‌లైన్‌ ప్రాజెక్టుల విషయంలో ముడుపులు చేతులు మారినట్లు సీబీఐకి సమాచారం అందింది. వీటి ఆధారంగా సోమవారం నుంచి పలు ప్రాంతాల్లో అధికారులు సోదాలు చేపట్టి వీరిని అదుపులోకి తీసుకున్నారు. దిల్లీ, నోయిడా, విశాఖపట్నంలో ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని