ఆసియాలో అతి పెద్ద కోటీశ్వరుడిగా..

ప్రముఖ చైనా వ్యాపారవేత్త, బిలియనీర్ ఝాంగ్ షాన్‌షాన్(66) ఆసియాలో ధనవంతుడిగా నిలిచారు. భారత వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీని వెనక్కి నెట్టి ఈ ఘనతను సొంతం

Updated : 06 Feb 2022 20:32 IST

బీజింగ్: ప్రముఖ చైనా వ్యాపారవేత్త, బిలియనీర్ ఝాంగ్ షాన్‌షాన్(66) ఆసియాలో ధనవంతుడిగా నిలిచారు. భారత వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీని వెనక్కి నెట్టి ఈ ఘనతను సొంతం చేసుకున్నారు. అలీబాబా గ్రూప్‌ అధినేత జాక్ మాతో సహా, ఇతర చైనా కుబేరుల స్థానాలను కూడా ఝాంగ్ అధిగమించారు. తాజాగా బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ వెల్లడించిన వివరాల ప్రకారం..2020లో ఆయన సంపద 70.9 బిలియన్‌ అమెరికన్ డాలర్ల నుంచి 77.8 బిలియన్ డాలర్లకు పెరిగింది. దాంతో ఆయన ప్రపంచంలోనే అత్యధిక సంపద కలిగిన వ్యక్తుల జాబితాలో 11వ స్థానంలో నిలిచారు. 

ఝాంగ్‌ 1996లో చైనాలోనే అతిపెద్ద శీతల పానియాల సంస్థ అయిన నాంగ్‌ఫూ స్ప్రింగ్‌ను స్థాపించారు. మంచినీళ్ల సీసాలను కూడా ఇది సరఫరా చేస్తోంది. ఈ సంస్థ హాంకాంగ్‌లో బెస్ట్‌ లిస్టింగ్స్‌లో ఒకటిగా కూడా నిలిచింది. లిస్టింగ్ ప్రారంభం నుంచి దాని షేర్లు ఇప్పటివరకు 155 శాతం పెరిగాయి. దాంతో ఆయన సంపద అనూహ్యంగా పెరిగింది. ఇది కాకుండా ఝాంగ్ ప్రముఖ ఫార్మా సంస్థ వాంటాయ్‌ అధినేత కూడా. ఆ సంస్థ షేర్లు 2000శాతం పెరిగాయి. ఈ సంస్థ కూడా కొవిడ్-19 టీకా తయారీలో పాలుపంచుకుంటోంది. ఈ రెండు సంస్థల అద్భుత పనితీరు కారణంగానే ఆసియా సంపన్నుల్లో మొదటి స్థానం దక్కించుకున్నారు. 

మరోవైపు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్‌ అంబానీ సంపద ప్రస్తుతం 76.9 బిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉంది. ప్రస్తుతం ఆయన ప్రపంచంలో 12వ సంపన్నుడిగా కొనసాగుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని