Cyient: సైయెంట్‌ చేతికి సిటెక్‌.. ఒప్పంద విలువ ₹800 కోట్లు!

ప్రముఖ ఐటీ కంపెనీ సైయెంట్‌.. ఫిన్‌లాండ్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఇంజినీరింగ్‌ సేవల సంస్థ సిటెక్‌ను కొనుగోలు చేసిందది....

Updated : 17 Aug 2022 15:40 IST

దిల్లీ: ప్రముఖ ఐటీ కంపెనీ సైయెంట్‌.. ఫిన్‌లాండ్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఇంజినీరింగ్‌ సేవల సంస్థ సిటెక్‌ను కొనుగోలు చేయనుంది. ఈ ఒప్పందం విలువ రూ.800 కోట్లు. 1984లో సిటెక్‌ను స్థాపించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 1,200 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇంధనం, మైనింగ్‌, ప్రాసెస్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్, తయారీ పరిశ్రమలకు ఇది ఇంజినీరింగ్‌ సేవలనందిస్తోంది. సైయెంట్‌ ఇప్పటి వరకు చేసిన కొనుగోళ్లలో ఇదే అతిపెద్దది. ఈ త్రైమాసికంలోనే కొనుగోలు ప్రక్రియ పూర్తికానుంది. 2021లో సిటెక్‌ రూ.660 కోట్ల ఆదాయాన్ని నివేదించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని