ఉద్యోగం చేస్తూ అదనంగా డబ్బు సంపాదించండి ఇలా..

డబ్బును మీ ఇంటికి అనుకోకుండా వచ్చిన అతిథిలా భావించి, మంచిగా చూసుకోవాలి. మీరు దానిని మంచిగా చూసుకున్నట్లైతే, అది మీ దగ్గరకు ఎల్లప్పుడూ వస్తూనే ఉంటుందని ఒక తెలివైన వ్యక్తి చెప్పాడు. ప్రతి ఒక్కరికీ ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశ ఉంటుంది.....

Published : 17 Dec 2020 17:06 IST

ఉద్యోగం చేస్తూ డబ్బు సంపాదించడానికి ఎనిమిది మార్గాలు​​​​​​​

డబ్బును మీ ఇంటికి అనుకోకుండా వచ్చిన అతిథిలా భావించి, మంచిగా చూసుకోవాలి. మీరు దానిని మంచిగా చూసుకున్నట్లైతే, అది మీ దగ్గరకు ఎల్లప్పుడూ వస్తూనే ఉంటుందని ఒక తెలివైన వ్యక్తి చెప్పాడు. ప్రతి ఒక్కరికీ ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశ ఉంటుంది. కొందరు దాని కోసం తేలివిగా ఆలోచించి సరైన పెట్టుబడి మార్గాల్లో పెట్టుబడి పెట్టి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బును సంపాదిస్తారు. మరి కొందరు మాత్రం ఎలా సంపాదించాలా అని ఆలోచిస్తూ ఉండిపోతారు. మరికొందరైతే ఉద్యోగం చేస్తూ డబ్బు సంపాదిస్తూనే అదనపు ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం ఎనిమిది మార్గాల్లో డబ్బు సంపాదించడం ఎలానో కింద తెలియచేస్తున్నాము.

  1. ఇండెక్స్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం

ఇండెక్స్ ఫండ్స్ అనేవి ఒక నిర్దిష్ట ఇండెక్స్ పనితీరును పరిశీలించడానికి రూపకల్పన చేసిన మ్యూచువల్ ఫండ్లు. భారతదేశంలో నిఫ్టీ, సెన్సెక్స్ లు ఇండెక్స్ లుగా ఉన్నాయి. పెట్టుబడిదారు ఒక ఇండెక్స్ ఫండ్ వాటాను కొనుగోలు చేసినప్పుడు, అతడు లేదా ఆమె ఒక అంతర్లీన ఇండెక్స్ లో సెక్యూరిటీలను కలిగి ఉన్న పోర్ట్ఫోలియో వాటాను కొనుగోలు చేస్తారు. ఇండెక్స్ అదే నిష్పత్తిలో ఫండ్ సెక్యూరిటీలను కలిగి ఉంది. ఫలితంగా, ఇండెక్స్ పెరిగినప్పుడు, ఫండ్ షేర్లు కూడా పెరుగుతాయి.

  1. బ్లాగ్ ను రాయండి

ప్రస్తుతం వెబ్ 3.0 అందుబాటులోకి రావడంతో, ఎవరైనా వారి అభిప్రాయాలు, జ్ఞానం, సృజనాత్మకతలను పంచుకోవడానికి ఇదొక మంచి అవకాశం. మీరు కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ను ఉపయోగించి బ్లాగ్ ను రాయవచ్చు. మీ బ్లాగ్ ల ద్వారా ఎక్కువ సంఖ్యలో పాఠకులను సంపాదించిన తరువాత, మీ బ్లాగ్ రేటింగ్ ఆధారంగా ప్రకటన నెట్ వర్క్, అనుబంధ మార్కెటింగ్, బ్రాండ్ సహకారం, స్పాన్సర్డ్ పోస్ట్లు, టెక్స్ట్, వీడియో ప్రకటన ద్వారా మీరు డబ్బు సంపాదించవచ్చు.

  1. వ్యాపారంలోకి మీ అభిరుచిని మళ్లించండి

మన రోజువారీ అవసరాలను కావలసిన వాటిని గమనించి, వాటిని అధ్యయనం చేసి వ్యాపారంలోకి అడుగుపెట్టడం మంచిదని వెటరన్ ఫైనాన్స్ రచయిత, వ్యవస్థాపకుడు రాబర్ట్ టోరు కియోసాకీ సూచించారు. ఒకవేళ మీరు అద్భుతంగా వంట చేసేవారైతే, వారాంతంలో ప్రత్యేకంగా శిక్షణా తరగతులను ప్రారంభించి డబ్బు సంపాదించవచ్చు. ఒకవేళ మొక్కలను పెరగడం, జంతువుల సంరక్షణ చూసుకోవడం తెలిసినవారైతే, ఒక ఫార్మ్ ను ప్రారంభించి పువ్వులు, మూలికలను అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అలాగే జంతువుల సంరక్షణా కేంద్రన్ని ఏర్పాటు చేసి డబ్బు సంపాదించవచ్చు.

  1. ఆన్ లైన్ కోర్సును ప్రారంభించడం

మీరు సమస్యను పరిష్కరించడంలో లోతైన నైపుణ్యాన్ని కలిగి ఉన్నట్లయితే, దాన్ని ఒక కోర్సు రూపంలో వ్యక్తీకరించవచ్చు. ఆన్ లైన్ కోర్సులను కొనడానికి, విక్రయించడానికి ప్రత్యేకంగా రూపొందించిన అనేక ఆన్ లైన్ కోర్సు ప్లాట్ ఫార్మ్ లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో స్వతంత్ర ప్లాట్ ఫార్మ్ లు, అల్ ఇన్ వన్ ప్లాట్ ఫార్మ్ లు, మార్కెట్ ప్లాట్ ఫార్మ్ లు, వర్డ్ ప్రెస్ ప్లగ్ ఇన్, కస్టమైజ్డ్ థీమ్ ఎంపికలు ఉన్నాయి. వీటి ద్వారా మీరు అదనపు డబ్బును సంపాదించవచ్చు.

  1. పుస్తకాలు రాయడం / ఈ-బుక్స్ రాయడం

ప్రస్తుత రోజుల్లో పుస్తకాలు / ఈ -బుక్స్ రాయడం సంపదను సృష్టించే ఒక అద్భుతమైన వ్యూహం. మీకు ఎలాంటి విషయాలపై పూర్తి అవగాహన ఉందొ, దానిని సంబంధించిన విషయాలను పుస్తక రూపంలో రాయండి. ఒకవేళ మీరు వైద్యులైతే, ఆరోగ్యంగా ఉండడానికి ఆచరించవలసిన విషయాలను పుస్తకం ద్వారా తెలపండి. ఒకవేళ మీకు ఫోటోగ్రఫీ గురించి తెలిసుంటే, అప్పుడు దానికి సంబంధించిన చిట్కాలను పుస్తక రూపంలో పంచుకోండి. ఇది మీకు అదనపు డబ్బును సంపాదించి పెడుతుంది.

  1. మీ ఇంటిలోని ఒక గది అద్దెకు ఇవ్వడం

చాలా మంది యజమానులు తమ ఫ్లాట్లు, ఇళ్లలో అతిథుల కోసం ప్రత్యేకంగా ఒక గదిని ఏర్పాటు చేసుకుంటారు. వేర్వేరు ప్రదేశాల నుంచి పర్యాటకులు, విద్యార్ధులు మీరు నివసిస్తున్న ప్రాంతానికి వచ్చినట్లైతే, ఎయిర్బీఎన్బీ, బుకింగ్, టర్న్ కీ, హోమ్ అవే వంటి వెబ్ సైట్ ల ద్వారా ఒక గదిని లేదా పూర్తి ఫ్లాట్ ను అద్దెకు తీసుకోవాలని భావిస్తారు. దీని ద్వారా అదనంగా డబ్బు సంపాదించడంతో పాటు, మీరు కొత్త సంసృతిని తెలుసుకోవడం, కొత్త భాషను నేర్చుకోవడం, సమాజ భావాన్ని పెంచుకోవడం చేయవచ్చు.

  1. కన్సల్టెన్సీ సేవలు ప్రారంభించడం

కొంత సమయం వెచ్చించి మరీ మీలో ఉన్న ప్రతిభను గుర్తించండి. గత కొన్ని రోజులు, వారాలు, నెలల కాలంలో మీ జీవితంలో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకోండి. మీరు నిర్వహణ, వ్యాపారం, ఆహారం, డేటింగ్, ఫ్యాషన్, పన్నుల చెల్లింపు వంటి అంశాలపై ఎవరికైనా విలువైన సలహాలను ఇచ్చారా? లేదా సాధారణంగా ఫోన్ ద్వారా తరచూ ప్రజల సమస్యలను పరిష్కరించగలరా? ఒకవేళ చేయగలిగినట్లైతే, మీ విలువైన సలహాలకు ఒక చిన్న ధరను ఫిక్స్ చేయడం ద్వారా మీలో అంతర్గతంగా ఉన్న ప్రతిభను డబ్బు రూపంలోకి మార్చుకోవచ్చు.

  1. పాత వస్తువులను అమ్మేయడం

ఒకవేళ మీరు ఉంటున్న ఇల్లు బట్టలు, పాత ఆభరణాలు, ఫర్నిచర్ వంటి అదనపు వస్తువులతో నిండిపోయినట్లైతే వాటిని వెంటనే అమ్మేయండి. ఇలా చేయడం ద్వారా కొంత అదనపు మొత్తాన్ని సంపాదించడమే కాకుండా, మరింత విశాలమైన జీవనాన్ని గడపగలరు. వీటిని అమ్మడానికి స్పాయిల్, ఓఏల్ఎక్స్, ఇతాషీ, రీఫెషనర్ వంటి ఆన్ లైన్ వెబ్ సైట్స్ అందుబాటులో ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని