కొవిషీల్డ్‌ ఎగుమతులకు అనుమతి ఉంది

ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా సౌజన్యంతో సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఉత్పత్తి చేసిన కొవిషీల్డ్‌ టీకాను అన్ని దేశాలకు ఎగుమతి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి

Published : 05 Jan 2021 14:45 IST

దిల్లీ: ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా సౌజన్యంతో సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఉత్పత్తి చేసిన కొవిషీల్డ్‌ టీకాను అన్ని దేశాలకు ఎగుమతి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి ఉందని ఆ సంస్థ సీఈవో అదార్‌ పూనావాలా వెల్లడించారు. కొవిషీల్డ్‌ ఎగుమతికి భారత్‌ అనుమతినివ్వలేదని సోమవారం వార్తలు వచ్చిన నేపథ్యంలో పూనావాలా ట్విటర్‌ వేదికగా  స్పష్టతనిచ్చారు. 

కొవిషీల్డ్‌ టీకా అత్యవసర వినియోగానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అదార్‌ పూనావాలా మాట్లాడుతూ.. మొదటి 100 మిలియన్ల డోసులను ప్రభుత్వానికి ప్రత్యేక ధరకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం భారత ప్రభుత్వానికి మాత్రమే అందించగలమని చెప్పారు. మరోవైపు కొవిషీల్డ్‌ 100 కోట్ల డోసుల కోసం అభివృద్ధి చెందుతున్న దేశాలతో సీరమ్‌ ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. సీరమ్‌ ప్రస్తుతం నెలకు 50 నుంచి 60 మిలియన్ల చొప్పున టీకాలను ఉత్పత్తి చేస్తోంది. ఫిబ్రవరి తర్వాత నెలకు 100 మిలియన్‌ డోసుల వరకు ఉత్పత్తి చేయనున్నట్లు  గతంలో తెలిపిన విషయం తెలిసిందే. 

ఇవీ చదవండి..

కొవిషీల్డ్‌: కేంద్రానికి రూ. 200.. ప్రైవేట్లో?

కొవాగ్జిన్‌ సురక్షితం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని