Foxconn: బెంగళూరు ప్లాంట్‌లోకి ఫాక్స్‌కాన్‌ మరో రూ.460 కోట్లు

Foxconn: సింగపూర్‌లోని తమ అనుబంధ సంస్థ ద్వారా ఫాక్స్‌కాన్‌ తమ బెంగళూరు ప్లాంట్‌లోకి మరో రూ.460 కోట్ల పెట్టుబడులను చొప్పించింది.

Published : 28 Dec 2023 13:06 IST

దిల్లీ: తైవాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్‌ తయారీ దిగ్గజం ఫాక్స్‌కాన్‌ (Foxconn) భారత్‌లో మరో రూ.461 కోట్లు పెట్టుబడిగా పెట్టింది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ‘ఫాక్స్‌కాన్‌ ప్రెసిషన్‌ ఇంజినీరింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’లో ఈ పెట్టుబడులు చొప్పించినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ తెలిపింది. సింగపూర్‌లోని అనుబంధ సంస్థ ‘ఫాక్స్‌కాన్‌ సింగపూర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ ద్వారా ఈ పెట్టుబడులు పెట్టినట్లు పేర్కొంది.

ఒక్కో షేరును రూ.10 చొప్పున 46,08,76,736 షేర్లను సింగపూర్‌ ఫాక్స్‌కాన్‌ కొనుగోలు చేసినట్లు కంపెనీ తెలిపింది. ఫాక్స్‌కాన్‌ (Foxconn) ప్రెసిషన్‌ను ఆరు నెలల క్రితం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు దేవనహళ్లిలోని ‘ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌’లో రూ.8,800 కోట్లతో అనుబంధ సంస్థను ఏర్పాటు చేస్తామని ఫాక్స్‌కాన్‌ గత జులైలో ప్రకటించింది. అందుకోసం 300 ఎకరాల స్థలాన్ని కూడా కొనుగోలు చేసింది. తొలి దశలో ఇక్కడ దాదాపు 50 వేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని