పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్‌ఎఫ్‌బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకుల (ఎస్‌ఎఫ్‌బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తెలిపింది.

Published : 27 Apr 2024 01:54 IST

ముంబయి: పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకుల (ఎస్‌ఎఫ్‌బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తెలిపింది. ప్రైవేట్‌ రంగంలో ఎస్‌ఎఫ్‌బీల లైసెన్సుల కోసం 2014 నవంబరులో ఆర్‌బీఐ మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రస్తుతం ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, ఈక్విటాస్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ సహా డజను వరకు ఎస్‌ఎఫ్‌బీలు ఉన్నాయి. ఒక ఎస్‌ఎఫ్‌బీ.. పూర్తి స్థాయి బ్యాంకుగా దరఖాస్తు చేసుకోవాలంటే అంతకుముందు త్రైమాసికం చివరినాటికి కనీసం రూ.1000 కోట్ల నికర సంపదను కలిగి ఉండాలని ఆర్‌బీఐ తెలిపింది. స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో షేర్లు నమోదై ఉండాలని పేర్కొంది. చివరి రెండు ఆర్థిక సంవత్సరాలకు లాభాలను ప్రకటించడమే కాకుండా.. స్థూల నిరర్థక ఆస్తులు, నికర నిరర్థక ఆస్తులు వరుసగా 3 శాతం, 1 శాతం లేదా అంతకంటే తక్కువగా ఉండాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని