హెచ్‌సీఎల్‌ టెక్‌ లాభం రూ.3,986 కోట్లు

దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్‌సీఎల్‌ టెక్‌ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది.

Published : 27 Apr 2024 01:54 IST

డివిడెండు రూ.18

దిల్లీ: దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్‌సీఎల్‌ టెక్‌ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. డిసెంబరు త్రైమాసికంలో కంపెనీ ఆర్జించిన రూ.4,350 కోట్లతో పోలిస్తే మాత్రం నికర లాభం 8.4 శాతం తగ్గింది. ఉద్యోగుల వ్యయాలు పెరగడమే ఇందుకు కారణం. మొత్తం కార్యకలాపాల ఆదాయం రూ.26,606 కోట్ల నుంచి 7.11 శాతం పెరిగి రూ.28,499 కోట్లకు చేరింది. పన్నుల ముందు లాభం(ఎబిటా) 10.6 శాతం తగ్గి రూ.5,018 కోట్లకు చేరింది. ఎబిటా మార్జిన్‌ ముందు త్రైమాసికంతో పోలిస్తే 19.8 శాతం నుంచి జనవరి-మార్చిలో 17.6 శాతానికి చేరింది. ఏడాది క్రితంతో పోలిస్తే 18.1 శాతంగా ఉంది. గత త్రైమాసికంలో ఉద్యోగుల వ్యయాలు 11.5 శాతం పెరిగాయి. వలసల రేటు 19.5 శాతం నుంచి 12.4 శాతానికి చేరింది.

  • 2024-25లో స్థిర కరెన్సీ ప్రాతిపదికన ఆదాయ వృద్ధి 3-5 శాతం, ఎబిటా మార్జిన్‌ 18-19 శాతం ఉండొచ్చని కంపెనీ అంచనా వేసింది.
  • పూర్తి ఆర్థిక సంవత్సరం(2023-24)లో కంపెనీ లాభం 5.73 శాతం వృద్ధితో రూ.15,702 కోట్లుగా నమోదైంది. ఆదాయం 8.33 శాతం అధికమై రూ.1,09,913 కోట్లుగా ఉంది.
  • మార్చి త్రైమాసికం ముగిసేసరికి కంపెనీ ఉద్యోగుల సంఖ్య 2,27,481గా ఉంది. ఏప్రిల్‌ 25 నుంచి కంపెనీ స్వతంత్ర డైరెక్టర్‌గా లీ ఫంగ్‌ చూను నియమిస్తున్నట్లు తెలిపింది.
  • 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుపై రూ.18 మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. మే 15లోగా వాటాదార్లకు డివిడెండ్‌ చెల్లించనుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని