ఐపీఓలకు 3 కంపెనీల దరఖాస్తు

పబ్లిక్‌ ఇష్యూలకు వచ్చేందుకు కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. 3 నెలల తర్వాత మళ్లీ ఐపీఓల కళ కనిపిస్తోంది. తాజాగా 3 కంపెనీలు సెబీ వద్ద ముసాయిదా పత్రాలు దాఖలు చేశాయి.

Published : 17 Aug 2022 04:33 IST

దిల్లీ: పబ్లిక్‌ ఇష్యూలకు వచ్చేందుకు కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. 3 నెలల తర్వాత మళ్లీ ఐపీఓల కళ కనిపిస్తోంది. తాజాగా 3 కంపెనీలు సెబీ వద్ద ముసాయిదా పత్రాలు దాఖలు చేశాయి.

* ఐటీ హార్డ్‌వేర్‌, మొబైల్‌ యాక్సెసరీస్‌ సంస్థ బాలాజీ సొల్యూషన్స్‌ ఐపీఓ ద్వారా తాజా ఈక్విటీ షేర్లను విక్రయించి   రూ.120 కోట్లు సమీకరించనుంది. దీంతో పాటు ప్రమోటర్‌, ప్రమోటర్‌ గ్రూప్‌ సంస్థలకు చెందిన 75 లక్షల షేర్లను ఓఎఫ్‌ఎస్‌ ద్వారా విక్రయించనుంది.

* రేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పెట్టుబడులున్న కాంకర్డ్‌ బయోటెక్‌ ఐపీఓ ద్వారా 2,09,25,652 షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా విక్రయించనుంది. నీ ఫెయిర్‌ఫ్యాక్స్‌కు చెందిన గో డిజిటల్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఐపీఓ ద్వారా రూ.1,250 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేయనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని