Amazon: రూ.82 లక్షల కోట్ల మార్కెట్‌ విలువ కోల్పోయిన అమెజాన్‌

స్టాక్‌ మార్కెట్లలో నమోదైన సంస్థల్లో, ప్రపంచంలోనే ఒక ట్రిలియన్‌ డాలర్ల (సుమారు రూ.82 లక్షల కోట్ల) మార్కెట్‌ విలువను కోల్పోయిన సంస్థగా అమెజాన్‌ రికార్డు నెలకొల్పింది.

Updated : 11 Nov 2022 09:11 IST

స్టాక్‌ మార్కెట్లలో నమోదైన సంస్థల్లో, ప్రపంచంలోనే ఒక ట్రిలియన్‌ డాలర్ల (సుమారు రూ.82 లక్షల కోట్ల) మార్కెట్‌ విలువను కోల్పోయిన సంస్థగా అమెజాన్‌ రికార్డు నెలకొల్పింది. 2021 జులైలో దీని మార్కెట్‌ విలువ రికార్డు స్థాయిలో 1.88 లక్షల కోట్ల డాలర్లు (సుమారు రూ.154 లక్షల కోట్లు)గా నమోదైంది.  ద్రవ్యోల్బణం బాగా పెరగడం, వడ్డీ రేట్లు అంతకంతకూ అధికమవ్వడానికి తోడు, కార్పొరేట్‌ ఫలితాలు నిరుత్సాహకరంగా ఉండటంతో ఈ ఏడాది అమెజాన్‌ షేరును మదుపర్లు భారీగా విక్రయించారు. బుధవారం నాటి ట్రేడింగ్‌లోనూ షేరు 4.3 శాతం తగ్గింది. దీంతో మార్కెట్‌ విలువ 879 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.72 లక్షల కోట్ల)కు తగ్గింది. విండోస్‌ సాఫ్ట్‌వేర్‌ తయారీ సంస్థ మైక్రోసాఫ్ట్‌ కూడా 2021 నవంబరు గరిష్ఠ స్థాయి నుంచి మైక్రోసాఫ్ట్‌ 889 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.72.90 లక్షల కోట్ల) మార్కెట్‌ విలువను కోల్పోయింది. ఫలితంగా మార్కెట్‌ విలువను అత్యధికంగా కోల్పోయిన సంస్థల్లో మొదటి రెండు స్థానాల్లో అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌ నిలిచాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని