గణనీయమైన పురోగతి బాటలో ఎయిరిండియా

గత ఏడాది కాలంలో ఎయిరిండియా గణనీయమైన పురోగతి సాధించిందని ఎయిరిండియా సీఈఓ క్యాంబెల్‌ విల్సన్‌ పేర్కొన్నారు. చరిత్రాత్మక విమానాల కొనుగోలు ఆర్డరును ఖరారు చేయనున్నట్లు తెలిపారు.

Updated : 28 Jan 2023 03:19 IST

సీఈఓ క్యాంబెల్‌ విల్సన్‌
ఎయిరిండియా కొని ఏడాది

దిల్లీ: గత ఏడాది కాలంలో ఎయిరిండియా గణనీయమైన పురోగతి సాధించిందని ఎయిరిండియా సీఈఓ క్యాంబెల్‌ విల్సన్‌ పేర్కొన్నారు. చరిత్రాత్మక విమానాల కొనుగోలు ఆర్డరును ఖరారు చేయనున్నట్లు తెలిపారు. పలు విభాగాల్లో 1200 మందికి పైగా నిపుణుల నైపుణ్యాలను మెరుగుపరచనున్నట్లు వెల్లడించారు. ఎయిరిండియాను టాటా గ్రూప్‌ కొనుగోలు చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన ఉద్యోగులకు సందేశం పంపించారు. రెండో ఏడాదిలో పలు సవాళ్లు ఉన్నప్పటికీ.. ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని అన్నారు. వచ్చే అయిదేళ్లలో వృద్ధి కోసం విహాన్‌.ఏఐ పేరిట రోడ్‌మ్యాప్‌ను ఎయిరిండియా రూపొందించింది. ఇందులో భాగంగా వైడ్‌ బాటీ విమానాల్లో మార్పులు చేర్పులకోసం 400 మిలియన్‌ డాలర్లు వెచ్చించనుంది. అయితే గత కొన్ని వారాల్లో రెండు అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణికుల అసభ్య ప్రవర్తనకు సంబంధించిన వివాదాలను ఎయిరిండియా ఎదుర్కొంది. ఈ ఘటనల్లో డీజీసీఏ జరిమానా సైతం విధించింది.
3 దశల్లో మార్పులు: 22 బ్రాడ్‌ వర్క్‌ స్ట్రీమ్‌ల్లో 100కు పైగా కార్యక్రమాలు నడుస్తున్నాయని, ఇవి మూడు దశలు ట్యాక్సీ, టేక్‌ ఆఫ్‌, క్లైంబ్‌ల్లో పూర్తిచేయనున్నట్లు క్యాంబెల్‌ తెలిపారు. పనిలో మెరుగుదలతో పాటు ఎయిరేషియాతో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌,  ఎయిరిండియాలో విస్తారాను విలీనం చేసే పనిలో ఉన్నట్లు వివరించారు. కొత్త ఇన్ఫోటెక్‌ కేంద్రం, ఏవియేషన్‌ అకాడమీని నెలకొల్పామని అన్నారు. గత ఏడాది కాలంలో ఎయిరిండియా మొత్తం విమానాల నిర్వహణ 27 శాతం పెరిగి 100కు చేరింది. 16 కొత్త అంతర్జాతీయ మార్గాల్లో సేవలు ప్రారంభమయ్యాయి. సగటు రోజువారీ అదాయం రెట్టింపు కాగా.. కాల్‌ సెంటల్‌ సేవలు కూడా పెరిగాయి. భవిష్యత్‌లోనూ ఇదే పురోగతి కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నట్లు క్యాంబెల్‌ విల్సన్‌ తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు