పన్ను..ఆదాయం.. వివరాలన్నీ యాప్‌లో
పన్ను చెల్లింపుదారులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా మొబైల్ యాప్‌ను తీసుకొచ్చినట్లు ఆదాయపు పన్ను విభాగం వెల్లడించింది.
అందుబాటులోకి ‘ఏఐఎస్ ఫర్ ట్యాక్స్‌పేయర్’
ఆదాయపు పన్ను విభాగం వెల్లడి
ఈనాడు, హైదరాబాద్: పన్ను చెల్లింపుదారులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా మొబైల్ యాప్‌ను తీసుకొచ్చినట్లు ఆదాయపు పన్ను విభాగం వెల్లడించింది. ‘ఏఐఎస్ ఫర్ ట్యాక్స్‌పేయర్’ పేరుతో ఈ యాప్ గూగుల్ ప్లే, యాప్‌స్టోర్‌లో అందుబాటులో ఉందని బుధవారం ఐటీ విభాగం తెలిపింది. దీన్ని ఉచితంగానే వినియోగించుకోవచ్చు. ఈ మొబైల్ యాప్ ద్వారా పన్ను చెల్లింపుదారులు తమ వార్షిక సమాచార నివేదిక (యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్- ఏఐఎస్), పన్ను చెల్లింపుదారు సమాచారం (ట్యాక్స్‌పేయర్ ఇన్ఫర్మేషన్ సమ్మరీ - టీఐఎస్) చూసుకునేందుకు వీలవుతుంది.
ఏఐఎస్‌లో పన్ను చెల్లింపుదారుడికి లభించిన అన్ని ఆదాయ వివరాలూ ఉంటాయి. వేతనం ద్వారా పొందిన ఆదాయం, డివిడెండ్లు, వడ్డీ, షేర్ల అమ్మకాల ద్వారా వచ్చిన లాభాలు, పన్ను చెల్లింపులు, మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్), పన్ను చెల్లింపు (టీసీఎస్), ఆదాయపు పన్ను రిఫండుతో పాటు జీఎస్టీ, విదేశీ చెల్లింపుల వంటివీ కనిపిస్తాయి. ఇందులో కనిపించే సమాచారంపై ఏమైనా ఫిర్యాదులుంటే దాన్ని నమోదు చేసే వీలునూ యాప్‌లో పొందుపర్చినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తెలిపింది.
ఓటీపీలతో...: ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత.. పాన్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి. ఇప్పటికే మీరు ఇన్‌కంట్యాక్స్ పోర్టల్‌లో పేర్కొన్న మొబైల్ నెంబరు, ఇ-మెయిల్ వివరాలను పేర్కొనాలి. ఈ రెండింటికీ ఇన్‌కంట్యాక్స్ నుంచి ఓటీపీలు వస్తాయి. వీటిని అధీకృతం చేసిన తర్వాత, నాలుగు అంకెల పిన్ ఏర్పాటు చేసుకుని, మొబైల్ యాప్‌ను వాడుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టాటా మోటార్స్ లాభం మూడింతలు
టాటా మోటార్స్, జనవరి- మార్చి త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.17,528.59 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే కాల లాభం రూ.5,496.04 కోట్లతో పోలిస్తే ఇది మూడు రెట్లకు పైగా ఎక్కువ. -
ఇక వెండి వంతు?
బంగారం ధర కొంతకాలంగా భారీగా పెరిగింది. రెండేళ్ల క్రితం బంగారంపై పెట్టుబడి పెట్టిన వారికి ఆకర్షణీయ లాభాలు వచ్చాయి. -
అక్షయ తృతీయ వేళ పెరిగిన బంగారం ధర
దేశీయంగా, అంతర్జాతీయంగా గిరాకీ కనిపించడంతో అక్షయ తృతీయ వేళ బంగారం ధర పెరిగింది. -
రాణించిన పారిశ్రామికం
దేశీయ పరిశ్రమల వృద్ధిని ప్రతిఫలించే పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) 2023-24 ఆర్థిక సంవత్సరంలో 5.8 శాతానికి చేరింది. 2022-23లోని 5.2 శాతంతో పోలిస్తే మెరుగైనట్లయింది. -
వరుస నష్టాల నుంచి ఉపశమనం
మూడు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు శుక్రవారం కోలుకున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, ఎయిర్టెల్ షేర్లు మార్కెట్లను ముందుండి నడిపించాయి. -
బ్యాంక్ ఆఫ్ బరోడా లాభం రూ.4,886 కోట్లు
జనవరి- మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) నికర లాభం స్టాండలోన్ ప్రాతిపదికన 2.3% పెరిగి రూ.4,886 కోట్లకు చేరింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.4,775 కోట్లుగా ఉంది. -
ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ మరో 75 విమానాల రద్దు!
క్యాబిన్ సిబ్బంది కొరత కారణంగా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ శుక్రవారం 75 విమాన సర్వీసులను రద్దు చేసింది. ఆదివారానికల్లా కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకోగలవని సంస్థ అధికారి ఒకరు తెలిపారు. -
ఒక్క నెలలో రూ.12,384 కోట్లు
ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఏప్రిల్‌లో రూ.12,384 కోట్ల ప్రీమియాన్ని వసూలు చేసినట్లు శుక్రవారం వెల్లడించింది. -
రూ.888కే జియో నుంచి 15 ఓటీటీలతో బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్
నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లైట్, డిస్నీ+ హాట్‌స్టార్ వంటి 15 యాప్‌ల ప్రాథమిక సబ్‌స్క్రిప్షన్‌తో పాటు 30 ఎమ్‌బీపీఎస్ బ్రాడ్‌బ్యాండ్‌ను నెలకు రూ.888కు అందించే ఒక పథకాన్ని జియో ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు( )
బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీఓఐ), గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,439 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. -
ఒకే ఫ్రేమ్‌లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా (Harsh Goenka) నెట్టింట మరో ఫన్నీ పోస్టు పెట్టారు. అలాగే ఆయన షేర్ చేసిన చిత్రం ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. -
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు
Reliance Jio: జియో ఫైబర్, ఎయిర్ ఫైబర్ యూజర్ల కోసం జియో కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ.888 ప్లాన్‌తో 15 ఓటీటీలు కూడా లభిస్తాయి.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్‌లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు