జియో ఫైనాన్షియల్‌ @ రూ.1,66,000 కోట్లు

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) నుంచి విభజించిన ఆర్థిక సేవల విభాగం జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (జేఎఫ్‌ఎస్‌ఎల్‌) మార్కెట్‌ విలువ రూ.1,66,000 కోట్లుగా (20 బిలియన్‌ డాలర్లు) తేలింది.

Updated : 21 Jul 2023 04:33 IST

మార్కెట్‌ విలువ పరంగా దేశంలో 32వ స్థానం
అదానీ పోర్ట్స్‌- గ్రీన్‌, ఐఓసీ,  కోల్‌ ఇండియా కంటే ఎగువనే

దిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) నుంచి విభజించిన ఆర్థిక సేవల విభాగం జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (జేఎఫ్‌ఎస్‌ఎల్‌) మార్కెట్‌ విలువ రూ.1,66,000 కోట్లుగా (20 బిలియన్‌ డాలర్లు) తేలింది. ఆర్‌ఐఎల్‌ షేర్లకు గురువారం ఎన్‌ఎస్‌ఈలో గంట పాటు (ఉదయం 9-10 మధ్య) నిర్వహించిన ప్రత్యేక ప్రీ ఓపెన్‌ సెషన్‌లో జేఎఫ్‌ఎస్‌ఎల్‌ షేరు స్థిర విలువను రూ.261.85గా నిర్థారించారు. రిలయన్స్‌ షేరు బుధవారం ముగింపు ధర రూ.2,841.85 కాగా; గురువారం ప్రత్యేక ప్రీ ఓపెన్‌ సెషన్‌ ముగింపు విలువ రూ.2,580. ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్నే జేఎఫ్‌ఎస్‌ఎల్‌ విలువగా నిర్థారించారు. ఒక్కో షేరుకు రూ.261.85 విలువ వద్ద జేఎఫ్‌ఎస్‌ఎల్‌ మొత్తం మార్కెట్‌ విలువ రూ.1,66,000 కోట్లుగా అవుతుంది. ఈ ప్రకారం చూస్తే.. మార్కెట్‌ విలువపరంగా దేశంలో 32వ స్థానంలో ఇది నిలిచింది. విశ్లేషకుల అంచనా వేసిన రూ.160-190 కంటే అధికంగానే జేఎఫ్‌ఎస్‌ఎల్‌ షేరుకు విలువ రావడం గమనార్హం.

* ఈనెల 20ని రికార్డు తేదీగా ప్రకటించినందున, ఆ తేదీ కల్లా ఖాతాల్లో ఉన్న ప్రతి ఆర్‌ఐఎల్‌ షేరుకు ఒక జేఎఫ్‌ఎస్‌ఎల్‌ షేరు లభిస్తుంది. జేఎఫ్‌ఎస్‌ఎల్‌ షేర్లు త్వరలోనే స్టాక్‌   ఎక్స్ఛేంజీల్లో ట్రేడింగ్‌కు అందుబాటులోకి వస్తాయి.

* అదానీ గ్రూపు సంస్థలైన అదానీ పోర్ట్స్‌, అదానీ గ్రీన్‌; టాటా స్టీల్‌, కోల్‌ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఐఓసీ, బజాజ్‌ ఆటోల కంటే కూడా జేఎఫ్‌ఎస్‌ఎల్‌ మార్కెట్‌ విలువే ఎక్కువగా ఉంది. ఇకపై ఆర్‌ఐఎల్‌ షేరు, తన ఆర్థిక సేవల విభాగం లేకుండానే ట్రేడ్‌ అవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు