Income Tax Refund: 35 లక్షల మందికి రిఫండు రాలేదు

ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసిన వారిలో దాదాపు 35 లక్షల మందికి వివిధ కారణాలతో రిఫండు అందలేదని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఛైర్‌పర్సన్‌ నితిన్‌ గుప్తా మంగళవారం వెల్లడించారు.

Updated : 11 Oct 2023 08:24 IST

సమస్య పరిష్కరించేందుకు చర్యలు: సీబీడీటీ ఛైర్‌పర్సన్‌  

దిల్లీ: ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసిన వారిలో దాదాపు 35 లక్షల మందికి వివిధ కారణాలతో రిఫండు(Income Tax Refund) అందలేదని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఛైర్‌పర్సన్‌ నితిన్‌ గుప్తా మంగళవారం వెల్లడించారు. ప్రధానంగా బ్యాంకు ఖాతా వివరాల్లో తప్పులు దొర్లడంతో పాటు, ఇతర కారణాలూ ఇందుకు నేపథ్యమని పేర్కొన్నారు. వీటిని పరిష్కరించేందుకు ఆదాయపు పన్ను విభాగం ప్రత్యేక సహాయక కేంద్రం అసెసీలను సంప్రదిస్తోందని తెలిపారు. సాధ్యమైనంత తొందరగా ఈ సమస్యలను తీర్చే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. బ్యాంకు వివరాలు సరిగ్గా ఉన్నవారికి రిఫండులను వేగంగా అందిస్తున్నట్లు చెప్పారు. 2010-11లో పన్ను బాకీ ఉన్నట్లు కొంతమందికి చూపిస్తోందన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. 2011లో ఐటీ విభాగం కొత్త సాంకేతికతను తీసుకొచ్చిందని, ఈ నేపథ్యంలో కొన్ని పాత డిమాండు నోటీసులు కనిపిస్తున్నాయని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని