లండన్‌లో రూ.1145 కోట్ల సౌధాన్ని కొంటున్న అదర్‌ పూనావాలా

సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) సీఈఓ అదర్‌ పూనావాలా అత్యధిక మొత్తంతో ఒక భవంతిని లండన్‌లో కొనుగోలు చేస్తున్నారు.

Updated : 13 Dec 2023 06:46 IST

లండన్‌: సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) సీఈఓ అదర్‌ పూనావాలా అత్యధిక మొత్తంతో ఒక భవంతిని లండన్‌లో కొనుగోలు చేస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా జరిగిన కొనుగోళ్లలో ఈ భవనం ధర అధికమని స్థిరాస్తి వర్గాలు పేర్కొంటున్నాయి. లండన్‌ నడిబొడ్డులో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న మేఫెయిర్‌ భవనాన్ని 138 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.1145 కోట్ల)తో పూనావాలా సొంతం చేసుకోబోతున్నారని  ఆంగ్ల వార్తా పత్రికలు పేర్కొన్నాయి. అబర్‌కాన్వే హౌజ్‌గా పిలిచే ఈ భవంతిని పోలండ్‌ ధనవంతురాలు డొమినికా కుల్కజిక్‌ నుంచి కొనుగోలు చేయడానికి పూనావాలా ఒప్పందం కుదుర్చుకున్నారని  తెలిసింది. పోలండ్‌లోనే అత్యంత ధనవంతుడైన జాన్‌ కుల్కజిక్‌ కూతురే డొమినికా. లండన్‌ వెళ్లినప్పుడు తన కంపెనీ, కుటుంబ అవసరాలకు పూనావాలా ఈ భవంతిని వినియోగించుకోనున్నారు. 1920ల నాటి ఈ అయిదు అంతస్తుల భవంతిని ఎస్‌ఐఐ బ్రిటన్‌ అనుబంధ సంస్థ సీరమ్‌ లైఫ్‌ సైన్సెస్‌ కొనుగోలు చేయనుంది. ఇప్పటిదాకా లండన్‌లో అత్యధిక ధరకు విక్రయమైన భవంతుల్లో దీనికి రెండో స్థానం దక్కుతుంది. 2020లో రాట్లాండ్‌ గేట్‌ 210 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.1743 కోట్ల)కు అమ్ముడుపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు