యాక్సిస్‌ బ్యాంక్‌లో కార్వీ ఖాతాల స్తంభన ఆదేశాలు రద్దు: శాట్‌ 

కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ ఖాతాలను స్తంభింప చేయాలంటూ నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) కు యాక్సిస్‌ బ్యాంకుకు ఇచ్చిన ఆదేశాలను సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (శాట్‌) రద్దు చేసింది. ఎన్‌ఎస్‌ఈ ఆదేశాలను సవాలు చేస్తూ..

Updated : 30 Nov 2021 05:04 IST

దిల్లీ: కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ ఖాతాలను స్తంభింప చేయాలంటూ నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ) కు యాక్సిస్‌ బ్యాంకుకు ఇచ్చిన ఆదేశాలను సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (శాట్‌) రద్దు చేసింది. ఎన్‌ఎస్‌ఈ ఆదేశాలను సవాలు చేస్తూ.. యాక్సిస్‌ బ్యాంక్‌ దాఖలు చేసిన అప్పీల్‌ను సమర్థిస్తూ శాట్‌ ఈ నిర్ణయం తీసుకుంది. క్లయింట్ల సెక్యూరిటీల దుర్వినియోగం, ఇతర నిబంధనల ఉల్లంఘన ఆరోపణల నేపథ్యంలో, ఎన్‌ఎస్‌ఈ నుంచి ముందస్తుగా అనుమతులు తీసుకోకుండా ఎటువంటి ఆస్తుల విక్రయం చేపట్టవద్దని కార్వీకి సెబీ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను అమలు చేయడంలో భాగంగా  కార్వీ ఖాతాలు స్తంభింప చేయాలంటూ యాక్సిస్‌ బ్యాంకుకు 2020 డిసెంబరులో ఎన్‌ఎస్‌ఈ ఆదేశాలిచ్చింది.  ఎన్‌ఎస్‌ఈ బైలా ప్రకారం.. ట్రేడింగ్‌ సంస్థకు మాత్రమే ఆదేశాలు ఇచ్చేందుకు ఎక్స్ఛేంజీకి అనుమతి ఉందని ట్రైబ్యునల్‌ స్పష్టం చేసింది. ఈ కేసులో ట్రేడింగ్‌ సంస్థ అంటే కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ మాత్రమే అని పేర్కొంది. అలాంటప్పుడు మూడో పార్టీకి (ఇక్కడ యాక్సిస్‌ బ్యాంక్‌) ఆదేశాలు ఎలా జారీ చేస్తారని పేర్కొంటూ, బ్యాంకుకు ఇచ్చిన ఆదేశాలను పక్కకుపెట్టింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని