మెట్రో బ్రాండ్స్‌ ఐపీఓ

పాదరక్షల విక్రయ సంస్థ మెట్రో బ్రాండ్స్‌ లిమిటెడ్‌, పబ్లిక్‌ ఇష్యూకు ధరల శ్రేణిగా రూ.485- 500ను నిర్ణయించింది. ఇష్యూ ఈనెల 10న ప్రారంభమై 14న ముగియనుంది.

Published : 08 Dec 2021 02:22 IST

ధరల శ్రేణి రూ.485- 500

దిల్లీ: పాదరక్షల విక్రయ సంస్థ మెట్రో బ్రాండ్స్‌ లిమిటెడ్‌, పబ్లిక్‌ ఇష్యూకు ధరల శ్రేణిగా రూ.485- 500ను నిర్ణయించింది. ఇష్యూ ఈనెల 10న ప్రారంభమై 14న ముగియనుంది. ఈ ఇష్యూ ద్వారా రూ.1,368 కోట్లు సమీకరించాలనుకుంటున్న సంస్థ, రూ.295 కోట్ల విలువైన కొత్త షేర్లను, ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో ప్రమోటర్లు, వాటాదార్లకు చెందిన 2.14 కోట్ల షేర్లను విక్రయించనుంది. ప్రస్తుతం ప్రమోటర్లకు కంపెనీలో 84 శాతం వాటా ఉండగా, 10 శాతాన్ని విక్రయించనున్నారు. 35 శాతాన్ని చిన్న మదుపర్లకు కేటాయించారు. ఇష్యూలో కనిష్ఠంగా 30 షేర్ల (ఒక లాట్‌)కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సమీకరించిన నిధులను మెట్రో, మోచి, వాక్‌వే, క్రాక్స్‌ బ్రాండ్లపై కొత్త విక్రయ కేంద్రాలను తెరిచేందుకు, ఇతర కార్పొరేట్‌ అవసరాలకు వినియోగిస్తామని కంపెనీ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని