రూ.400 కోట్లతో ఏజీఐ గ్లాస్‌ప్యాక్‌ ప్లాంట్‌

ఏజీఐ గ్లాస్‌ప్యాక్‌ భువనగిరిలో రూ.400 కోట్లతో నిర్మించిన ప్లాంటు ప్రారంభానికి సిద్ధమయ్యింది. వచ్చే వారంలో ఈ కొత్త యూనిట్‌ నుంచి ఉత్పత్తి ప్రారంభం కానుంది. విస్తరణలో భాగంగా నిర్మించిన ఈ ప్లాంటు వల్ల

Published : 23 Jan 2022 02:54 IST

వచ్చే వారంలో ఉత్పత్తి ప్రారంభం

హైదరాబాద్‌: ఏజీఐ గ్లాస్‌ప్యాక్‌ భువనగిరిలో రూ.400 కోట్లతో నిర్మించిన ప్లాంటు ప్రారంభానికి సిద్ధమయ్యింది. వచ్చే వారంలో ఈ కొత్త యూనిట్‌ నుంచి ఉత్పత్తి ప్రారంభం కానుంది. విస్తరణలో భాగంగా నిర్మించిన ఈ ప్లాంటు వల్ల 700పైగా ఉద్యోగాలు లభిస్తాయని, పరోక్షంగానూ ఉపాధి లభిస్తుందని సంస్థ అంటోంది. హైదరాబాద్‌లో అభివృద్ధి, పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఈ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. మార్చి నాటికి 1,750 మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తిని సాధించనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని