Anil Ambani: అనిల్‌ అంబానీపై సెబీ నిషేధం.. ఎందుకంటే?

సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌తో పాటు పారిశ్రామికవేత్త అనిల్‌ అంబానీ, మరో ముగ్గురిపై సెబీ నిషేధం విధించింది. ఈ కంపెనీలో మోసపూరిత కార్యకలాపాలు చేపట్టారన్నది వీరిపై ఆరోపణ

Updated : 12 Feb 2022 07:48 IST

దిల్లీ: సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌తో పాటు పారిశ్రామికవేత్త అనిల్‌ అంబానీ, మరో ముగ్గురిపై సెబీ నిషేధం విధించింది. ఈ కంపెనీలో మోసపూరిత కార్యకలాపాలు చేపట్టారన్నది వీరిపై ఆరోపణ. అమిత్‌ బప్నా, రవీంద్ర సుధాకర్‌, పింకేశ్‌ ఆర్‌ షాలు ఈ జాబితాలో ఉన్నారు. ‘సెబీ వద్ద నమోదైన ఏ ఇంటర్మీడియరీతో కానీ, ఏ లిస్టెడ్‌ కంపెనీతో కానీ లేదా ఏ పబ్లిక్‌ కంపెనీకి చెందిన డైరెక్టర్లు/ప్రమోటర్ల నుంచి కానీ తదుపరి ఉత్తర్వులు అందేంత వరకు ఈ వ్యక్తులు నిధుల సమీకరణ చేపట్టరాద’ని మార్కెట్‌ నియంత్రణాధికార సంస్థ జారీ చేసిన 100 పేజీల మధ్యంతర ఆదేశాల్లో స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు