మారుతీ సుజుకీకి కొత్త ఎండీ

దేశీయ వాహన దిగ్గజ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) నూతన ఎండీ, సీఈఓగా హిసాషి టకూచిని నియమించినట్లు కంపెనీ గురువారం తెలిపింది. ఈ నియామకం ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. గురువారం నిర్వహించిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Published : 25 Mar 2022 06:19 IST

ఏప్రిల్‌ 1 నుంచి బాధ్యతలు

దిల్లీ: దేశీయ వాహన దిగ్గజ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) నూతన ఎండీ, సీఈఓగా హిసాషి టకూచిని నియమించినట్లు కంపెనీ గురువారం తెలిపింది. ఈ నియామకం ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. గురువారం నిర్వహించిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఎండీ, సీఈఓగా ఉన్న కెనిచి అయుకవా పదవీ కాలం ఈ నెల 31తో ముగియనున్న నేపథ్యంలో కొత్త సారథిని బోర్డు ఎంపిక చేసిందని కంపెనీ తెలిపింది. కంపెనీ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు అయుకవాను పూర్తి కాల డైరెక్టరుగా కొనసాగించనున్నారు. ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ఛైర్మన్‌ హోదాలో ఆయన సెప్టెంబరు 30 వరకు ఉండటంతో పాటు కంపెనీకి మార్గదర్శనం చేయనున్నారని మారుతీ వెల్లడించింది. వాటాదార్ల ఆమోదం తర్వాత ఈ నియామకాలు అమల్లోకి వస్తాయి.
* టకూచి 1986లో సుజుకీ మోటార్‌ కార్పొరేషన్‌లో (ఎస్‌ఎంసీ) చేరారు. అంతర్జాతీయ కార్యకలాపాలు చూసుకునే ఈయన 2019 జులై నుంచి మారుతీ సుజుకీ బోర్డులో కొనసాగుతున్నారు. 2021 ఏప్రిల్‌ నుంచి జాయింట్‌ ఎండీగా (కమర్షియల్‌) బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని