బాష్‌ నుంచి హైడ్రోజన్‌ వాహనాలు

జర్మనీకి చెందిన బాష్‌ భారత్‌లో 2025-26 కల్లా హైడ్రోజన్‌ ఆధారిత వాహనాలను ప్రయోగాత్మక పద్ధతిలో తీసుకురానుంది. కంపెనీ భారత్‌లో కార్యకలాపాలను ప్రారంభించి

Published : 20 May 2022 02:48 IST

 2025-26 కల్లా పైలట్‌ పద్ధతిలో

బెంగళూరు: జర్మనీకి చెందిన బాష్‌ భారత్‌లో 2025-26 కల్లా హైడ్రోజన్‌ ఆధారిత వాహనాలను ప్రయోగాత్మక పద్ధతిలో తీసుకురానుంది. కంపెనీ భారత్‌లో కార్యకలాపాలను ప్రారంభించి ఈ ఏడాదితో 100 ఏళ్లు పూర్తవుతుండడం విశేషం. ‘హైడ్రోజన్‌ ఆధారిత వాహనాలను తెచ్చే విషయంలో అభివృద్ధి చెందిన దేశాల కంటే వెనకబడకూడదు. కాబట్టి మేం 2025-26 నాటికి కొన్నిటినైనా పైలట్‌ పద్ధతిలో ఇక్కడ ప్రారంభిస్తామ’ని బాష్‌ సంయుక్త ఎండీ, చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ గురుప్రసాద్‌ మద్లాపూర్‌ పేర్కొన్నారు. కంపెనీ హైడ్రోజన్‌ విభాగంపైనా దృష్టి సారిస్తోందని బాష్‌ ఎండీ సౌమిత్ర భట్టాచార్య ప్రకటించిన నేపథ్యంలో గురుప్రసాద్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘చైనా, ఐరోపా, అమెరికాలలో ఫ్యూయల్‌ సెల్‌ విద్యుత్‌ వాహనాలను పైలట్‌ పద్ధతిలో నడుపుతున్నాం. భారత్‌కు ఎపుడు తీసుకురావాలన్నది ఒరిజినల్‌ ఎక్విప్‌మెంట్‌ తయారీదార్లతో చర్చిస్తున్నామ’ని ఆయన అన్నారు. హైడ్రోజన్‌ వాహనాలను నడిపేందుకు ప్రస్తుత మౌలిక వసతులు సరిపోవు. హైడ్రోజన్‌ ఫిల్లింగ్‌ స్టేషన్లు, హైడ్రోజన్‌ తయారీ యూనిట్ల అవసరం ఉందని ఆయన వివరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని