ఒలెక్ట్రాకు 2,100 ఇ బస్సుల ఆర్డరు

హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న విద్యుత్తు బస్సుల తయారీ కంపెనీ- ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ రూ.3,675 కోట్ల అతిపెద్ద ఆర్డర్‌ సంపాదించింది. ఇది మహారాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన బెస్ట్‌ (బృహన్‌ ముంబయి ఎలక్ట్రిక్‌ సప్లై అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌) కు 2,100 విద్యుత్తు బస్సులు సరఫరా చేసే కాంట్రాక్టు. తన అను

Published : 24 May 2022 02:54 IST

విలువ రూ.3675 కోట్లు

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న విద్యుత్తు బస్సుల తయారీ కంపెనీ- ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ రూ.3,675 కోట్ల అతిపెద్ద ఆర్డర్‌ సంపాదించింది. ఇది మహారాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన బెస్ట్‌ (బృహన్‌ ముంబయి ఎలక్ట్రిక్‌ సప్లై అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌) కు 2,100 విద్యుత్తు బస్సులు సరఫరా చేసే కాంట్రాక్టు. తన అనుబంధ సంస్థ అయిన ఈవీ ట్రాన్స్‌ ఈ కాంట్రాక్టు నిర్వహిస్తుందని, ఈ మేరకు లెటర్‌ ఆఫ్‌ అవార్డు వచ్చినట్లు ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ వెల్లడించింది. గ్రాస్‌ కాస్ట్‌ కాంట్రాక్టు / ఆపెక్స్‌ పద్ధతిలో పన్నేండేళ్ల కాలానికి ఈ కాంట్రాక్టు వర్తిస్తుందని పేర్కొంది. విద్యుత్తు వాహనాల సరఫరాకు సంబంధించి మనదేశంలో ఇంతవరకూ ఇదే అతిపెద్ద ఆర్డర్‌ కావడం గమనార్హం. వచ్చే ఏడాది కాలంలో బస్సులు సరఫరా చేయాల్సి ఉంటుంది.

12 నెలల్లోగా అందిస్తాం:  దీనిపై ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కేవీ ప్రదీప్‌ స్పందిస్తూ దేశ వాణిజ్య రాజధాని అయిన ముంబయి ప్రజల అవసరాలు తీర్చేందుకు విద్యుత్తు బస్సులు అందించే అరుదైన అవకాశం తమకు దక్కిందని పేర్కొన్నారు. నిర్ణీత కాలంలోగా ఈ బస్సులు సరఫరా చేస్తామని స్పష్టం చేశారు. ఈ కాంట్రాక్టు కింద 12 మీటర్ల పొడవు గల ఎయిర్‌ కండిషన్డ్‌  విద్యుత్తు బస్సులను ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ అందించనుంది. తాము ఇంతకు ముందు గోవా, పుణె, హైదరాబాద్‌, డెహ్రాడూన్‌, సూరత్‌, అహ్మదాబాద్‌, సిల్వాసా, నాగ్‌పూర్‌.. తదితర నగరాలకు విద్యుత్తు బస్సులు అందించినట్లు కేవీ ప్రదీప్‌ వెల్లడించారు. ఎంఈఐఎల్‌ గ్రూప్‌ సంస్టే  ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని