బ్లూపిన్‌ టెక్‌లో ఐటీసీ 10% వాటా కొనుగోలు

డైరెక్ట్‌ టు కన్జూమర్‌ (డి2సి) బ్రాండ్‌ ‘మైలో’ను నడిపిస్తున్న బ్లూపిన్‌ టెక్నాలజీస్‌లో 10.07 శాతం వాటాను ఐటీసీ శనివారం కొనుగోలు చేసింది. ఇందుకోసం రూ.39.34 కోట్లు వెచ్చించింది. ఈ పెట్టుబడి అభివృద్ధి చెందుతున్న కంటెంట్‌-టు-కమ్యూనిటీ-టు-కామర్స్‌ రంగంలో సంస్థకు ముందస్తు

Published : 29 May 2022 02:33 IST

దిల్లీ: డైరెక్ట్‌ టు కన్జూమర్‌ (డి2సి) బ్రాండ్‌ ‘మైలో’ను నడిపిస్తున్న బ్లూపిన్‌ టెక్నాలజీస్‌లో 10.07 శాతం వాటాను ఐటీసీ శనివారం కొనుగోలు చేసింది. ఇందుకోసం రూ.39.34 కోట్లు వెచ్చించింది. ఈ పెట్టుబడి అభివృద్ధి చెందుతున్న కంటెంట్‌-టు-కమ్యూనిటీ-టు-కామర్స్‌ రంగంలో సంస్థకు ముందస్తు కదలికల (ఎర్లీ మూవర్‌) ప్రయోజనాన్ని కలిగిస్తుందని, అలాగే డి2సి రంగంలో మరింత విస్తరించడానికి కూడా దోహదం చేస్తుందని ఐటీసీ తెలిపింది. బ్లూపిన్‌ టెక్‌ అనేది వెబ్‌, యాప్‌ ఆధారిత కంటెంట్‌-టు-కమ్యూనిటీ-టు-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌. ఈ సంస్థ తల్లీబిడ్డల సంరక్షణ ఉత్పత్తులు, సేవలను మైలో బ్రాండ్‌ కింద అందిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని