5g Network: ఏడాది చివరికల్లా 20 నుంచి 25 నగరాల్లో 5జీ

దేశవ్యాప్తంగా కనీసం 20-25 నగరాల్లో ఈ ఏడాది చివరికల్లా 5జీ సేవలు ప్రారంభమవుతాయని కమ్యూనికేషన్ల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆగస్టు-సెప్టెంబరు కల్లా 5జీ సేవలు మొదలవుతాయని శనివారమిక్కడ జరిగిన ఒక సదస్సులో

Updated : 19 Jun 2022 08:21 IST

టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్‌

దిల్లీ: దేశవ్యాప్తంగా కనీసం 20-25 నగరాల్లో ఈ ఏడాది చివరికల్లా 5జీ సేవలు ప్రారంభమవుతాయని కమ్యూనికేషన్ల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆగస్టు-సెప్టెంబరు కల్లా 5జీ సేవలు మొదలవుతాయని శనివారమిక్కడ జరిగిన ఒక సదస్సులో ఆయన తెలిపారు. కాగా, ప్రారంభ దశలో 5జీ సేవలు అందుకునే ఆ నగరాల పేర్లను వైష్ణవ్‌ వెల్లడించలేదు. 2022 ఏడాదిలోగా తొలి దశలో 13 నగరాల్లో 5జీ సేవలు మొదలవుతాయని టెలికాం విభాగం(డాట్‌) డిసెంబరులో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆ జాబితాలో హైదరాబాద్‌తో పాటు దిల్లీ, గురుగ్రామ్‌, ముంబయి, పుణె, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, చండీగఢ్‌, లఖ్‌నవూ, అహ్మదాబాద్‌, గాంధీనగర్‌, జామ్‌నగర్‌లున్నాయి. 5జీ వేలాన్ని నిర్వహించడం కోసం డాట్‌ చేసిన ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి బుధవారం ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. సోమవారం 5జీ స్పెక్ట్రమ్‌ వేలానికి సంబంధించిన బిడ్‌ ముందస్తు సమావేశాన్ని సైతం డాట్‌ నిర్వహించనుంది. రూ.4.5 లక్షల కోట్ల విలువైన మొత్తం 72 గిగాహెర్ట్జ్‌ స్పెక్ట్రమ్‌ను ప్రభుత్వం వేలంలో ఉంచనున్న సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని