జొమాటో చేతికి బ్లింక్‌ కామర్స్‌

క్విక్‌ కామర్స్‌ సంస్థ బ్లింకిట్‌ను నిర్వహించే బ్లింక్‌ కామర్స్‌ (ఇంతకు ముందు గ్రోఫర్స్‌ ఇండియా)ను రూ.4,447.48 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు ఆన్‌లైన్‌ ఆహార డెలివరీ ప్లాట్‌ఫామ్‌ జొమాటో ప్రకటించింది. పూర్తిగా షేరు బదిలీ పద్ధతిలో ఈ లావాదేవీ జరగనుంది.

Published : 25 Jun 2022 03:16 IST

విలువ రూ.4,447 కోట్లు

దిల్లీ: క్విక్‌ కామర్స్‌ సంస్థ బ్లింకిట్‌ను నిర్వహించే బ్లింక్‌ కామర్స్‌ (ఇంతకు ముందు గ్రోఫర్స్‌ ఇండియా)ను రూ.4,447.48 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు ఆన్‌లైన్‌ ఆహార డెలివరీ ప్లాట్‌ఫామ్‌ జొమాటో ప్రకటించింది. పూర్తిగా షేరు బదిలీ పద్ధతిలో ఈ లావాదేవీ జరగనుంది. ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.13.45 లక్షలు చొప్పున 33,018 బ్లింక్‌ కామర్స్‌ షేర్లను కొనుగోలు చేయడానికి బోర్డు ఆమోదం తెలిపినట్లు ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో జొమాటో పేర్కొంది. 62.85 కోట్ల వరకు జొమాటో ఫుల్లీ పెయిడప్‌ ఈక్విటీ షేర్ల జారీ, కేటాయింపు ద్వారా ఈ లావాదేవీ పూర్తవుతుంది. రూ.1 ముఖవిలువ కలిగిన జొమాటో షేరును రూ.70.76 చొప్పున కేటాయిస్తారు. ప్రస్తుతం బ్లింక్‌ కామర్స్‌లో 1 ఈక్విటీ షేరు, 3,248 ప్రిఫరెన్స్‌ షేర్లు ఉన్నట్లు జొమాటో తెలిపింది. క్విక్‌ కామర్స్‌ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలన్న వ్యూహంలో భాగంగా ఈ కొనుగోలు చేపట్టినట్లు వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని