ఆహారం, పానీయాల వ్యాపారంలోకి రిలయన్స్‌ బ్రాండ్స్‌

ఆహారం, పానీయాల వ్యాపారంలోకి అడుగుపెట్టినట్లు రిలయన్స్‌ బ్రాండ్స్‌ ప్రకటించింది. బ్రిటన్‌కు చెందిన తాజా ఆహారం, ఆర్గానిక్‌ కాఫీ సంస్థ ‘ప్రెట్‌ ఏ మ్యాంగర్‌’తో దీర్ఘకాలిక మాస్టర్‌ ఫ్రాంఛైజీ భాగస్వామ్యాన్ని రిలయన్స్‌ బ్రాండ్స్‌ కుదుర్చుకుంది. భారత్‌లో బ్రాండ్‌ నిర్మాణం, దేశవ్యాప్తంగా

Published : 01 Jul 2022 02:02 IST

దిల్లీ: ఆహారం, పానీయాల వ్యాపారంలోకి అడుగుపెట్టినట్లు రిలయన్స్‌ బ్రాండ్స్‌ ప్రకటించింది. బ్రిటన్‌కు చెందిన తాజా ఆహారం, ఆర్గానిక్‌ కాఫీ సంస్థ ‘ప్రెట్‌ ఏ మ్యాంగర్‌’తో దీర్ఘకాలిక మాస్టర్‌ ఫ్రాంఛైజీ భాగస్వామ్యాన్ని రిలయన్స్‌ బ్రాండ్స్‌ కుదుర్చుకుంది. భారత్‌లో బ్రాండ్‌ నిర్మాణం, దేశవ్యాప్తంగా విక్రయశాలల ఏర్పాటు వంటి పనులను నిర్వహించనుంది. ముందు ప్రధాన నగరాలు, పర్యాటక ప్రాంతాల్లో ఈ ఔట్‌లెట్‌లను ఏర్పాటు చేయనుంది. 1986లో లండన్‌లో ప్రారంభమైన ప్రెట్‌ ఏ మ్యాంగర్‌కు ప్రస్తుతం బ్రిటన్‌, అమెరికా, హాంకాంగ్‌, ఫ్రాన్స్‌, దుబాయ్‌, స్విట్జర్లాండ్‌, బ్రసెల్స్‌, సింగపూర్‌, జర్మనీల్లో 550 షాపులు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని