ఔషధ దుకాణాల్లో టెలిమెడిసిన్‌ సేవలు

చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని వారికీ టెలిమెడిసిన్‌ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు మెడ్‌లీమెడ్‌ ఆనంద ఇ-క్లినిక్‌ సేవలను ప్రారంభించింది. ఇందుకోసం ఔషధ దుకాణాల్లో ప్రత్యేక కియోస్కులను ఏర్పాటు చేస్తున్నట్లు మెడ్‌లీ మెడికల్‌ సొల్యూషన్స్‌ వ్యవ

Published : 06 Jul 2022 03:43 IST

ఆనంద ఇ-క్లినిక్‌ ప్రారంభించిన మెడ్‌లీమెడ్‌

ఈనాడు, హైదరాబాద్‌: చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని వారికీ టెలిమెడిసిన్‌ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు మెడ్‌లీమెడ్‌ ఆనంద ఇ-క్లినిక్‌ సేవలను ప్రారంభించింది. ఇందుకోసం ఔషధ దుకాణాల్లో ప్రత్యేక కియోస్కులను ఏర్పాటు చేస్తున్నట్లు మెడ్‌లీ మెడికల్‌ సొల్యూషన్స్‌ వ్యవస్థాపకుడు, ఎండీ  ఎం.సత్యేంద్ర తెలిపారు. ఏదైనా అనారోగ్యం తలెత్తితే, చాలామంది సొంతంగా ఔషధాలను కొనుగోలు చేస్తున్నారు. దీనివల్ల కొన్నిసార్లు ఇబ్బందులు వస్తున్నాయి. ఇందుకు భిన్నంగా అప్పటికప్పుడే వైద్య నిపుణులను స్వల్పరుసుముపై సంప్రదించి, మందులు తీసుకునేందుకు ఆనంద ఇ-క్లినిక్‌లు తోడ్పడతాయని వెల్లడించారు. ఔషధ దుకాణాలను డిజిటలీకరణ, బ్రాండింగ్‌ చేయడంతో పాటు హైదరాబాద్‌లో 4వేలకు పైగా ఔషధ విక్రయ కేంద్రాలకు బీ2బీ సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మెడ్‌లీమెడ్‌ బ్రాండ్‌ కింద 27 దుకాణాలున్నాయన్నారు. మూడేళ్లలో రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు, దేశ వ్యాప్తంగా 1,000కి పైగా కేంద్రాలను ఏర్పాటు చేసే లక్ష్యంతో ఉన్నట్లు వివరించారు. వ్యాపార విస్తరణ కోసం రూ.40 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టామన్నారు. దాదాపు 30 రకాల పరీక్షలను చేసేలా ఫార్మాసిస్టులకు శిక్షణ అందిస్తున్నట్లు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని