ఆధార్‌తో జత చేశారా?

ఒక వ్యక్తికి ఒకటికి మించి పాన్‌ కార్డులు లేకుండా చూసే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) పాన్‌ను తప్పనిసరిగా ఆధార్‌తో అనుసంధానం చేయాలనే నిబంధన విధించింది.

Updated : 17 Aug 2022 11:18 IST

ఒక వ్యక్తికి ఒకటికి మించి పాన్‌ కార్డులు లేకుండా చూసే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) పాన్‌ను తప్పనిసరిగా ఆధార్‌తో అనుసంధానం చేయాలనే నిబంధన విధించింది. దీనికోసం మార్చి 31 వరకూ గడువునిచ్చింది. ఆ తర్వాత పాన్‌ - ఆధార్‌ అనుసంధానం చేసేందుకు రూ.500 అపరాధ రుసుముతో జూన్‌ 30 వరకూ సమయం ఇచ్చింది. అప్పటికీ జత చేయనివారు జులై 1 నుంచి రూ.1,000 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. పాన్, ఆధార్‌లో పేర్లు, పుట్టిన తేదీ వివరాలు ఒకేలా ఉండాలి. లేకపోతే వీటిని జత చేయడం కుదరదు. కాబట్టి, ఏమైనా తప్పులుంటే వాటిని సరి చేసుకోండి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని