ఎస్‌బీఐ అందించే వివిధ ర‌కాల రుణాలు

ఇంటి కొనుగోలు, ఉన్న‌త విద్య‌, వాహ‌న కొనుగోలు లాంటి వ్య‌క్తుల ఆర్థిక అవ‌స‌రాల‌ను తీర్చేందుకు దేశంలో అతి పెద్ద బ్యాంకైనా ఎస్‌బీఐ వివిధ రుణాల‌ను మంజూరు చేస్తోంది. ఈ రుణాల‌పై ఆక‌ర్ష‌ణీయ‌మైన వ‌డ్డీ రేట్లు అందిస్తున్న‌ట్లు బ్యాంక్ త‌న వెబ్‌సైట్‌లో పేర్కోంది. వ‌డ్డీ రేట్లు

Published : 17 Dec 2020 19:47 IST

ఇంటి కొనుగోలు, ఉన్న‌త విద్య‌, వాహ‌న కొనుగోలు లాంటి వ్య‌క్తుల ఆర్థిక అవ‌స‌రాల‌ను తీర్చేందుకు దేశంలో అతి పెద్ద బ్యాంకైనా ఎస్‌బీఐ వివిధ రుణాల‌ను మంజూరు చేస్తోంది. ఈ రుణాల‌పై ఆక‌ర్ష‌ణీయ‌మైన వ‌డ్డీ రేట్లు అందిస్తున్న‌ట్లు బ్యాంక్ త‌న వెబ్‌సైట్‌లో పేర్కోంది. వ‌డ్డీ రేట్లు రుణ మొత్తం, కాల వ్య‌వ‌ధికి అనుగుణంగా ఉంటాయ‌ని ఎస్‌బీఐ స్ప‌ష్టం చేసింది.

ఎస్‌బీఐ అందించే వివిధ ర‌కాల రుణాల గురించి తెలుసుకుందామా!
1. గృహ రుణాలు
ఇళ్లు కొనుగోలు చేయ‌డానికి, ఇప్ప‌టికే ఉన్న ఇంటిని ఆధునికీక‌రించ‌డానికి, ఇంటి త‌న‌ఖా రుణాలు ఈ విభాగం కిందికి వ‌స్తాయని ఎస్‌బీఐ తెలిపింది. బ్యాంక్ త‌న వెబ్‌సైట్‌లో తెలిపిన వివ‌రాల ప్ర‌కారం రూ.30 ల‌క్ష‌ల లోపు గృహ రుణాల‌పై 8.35-8.50 శాతం వ‌డ్డీ విధిస్తున్న‌ట్లు తెలిపింది. ఎస్‌బీఐ గృహ రుణాల పోర్ట్‌ఫోలియోలో రెగ్యుల‌ర్ హోమ్ లోన్‌, ఎన్ఆర్ఐ హోమ్ లోన్, బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫ‌ర్ హోమ్ లోన్‌లు కూడా క‌లిసి ఉన్నాయి.

2. విద్యా రుణాలు
ఎస్‌బీఐ వివిధ ర‌కాల విద్యా రుణాల‌ను ఇస్తోంది. వాటిలో విద్యార్థి రుణం, స్కాల‌ర్ రుణం, విదేశాల‌లో చ‌దువుకు అవ‌స‌ర‌మైన రుణాల ప‌థకాలున్నాయి. స్కాలర్ రుణం కింద దేశంలో అత్యున్న‌త విద్యా సంస్థ‌లైన ఐఐటీలు, ఐఐఎమ్‌లు, ఎన్ఐటీ, ఎయిమ్స్‌ల‌లో విద్యార్జ‌న‌కు అవ‌స‌ర‌మైన రుణాల‌ను రూ.30 ల‌క్ష‌ల‌లోపు బ్యాంక్ అందిస్తోంది. అలాగే విదేశీ క‌ళాశాల‌లు/విశ్వ విద్యాల‌యాల‌లో ఫుల్ టైమ్ రెగ్యుల‌ర్ కోర్సులు చ‌దువుకునేందుకు రూ.20 ల‌క్ష‌ల నుంచి రూ.1.5 కోట్ల వ‌ర‌కు ప్ర‌త్యేకంగా విద్యా రుణాల‌ను ఇస్తోంది. దీంతోపాటు విద్యార్థి రుణం కింద విద్య‌న‌భ్య‌సించేందుకు మ‌న దేశంలో అయితే రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కు, విదేశాల్లో అయితే రూ.20 ల‌క్ష‌ల వ‌ర‌కు రుణాల‌ను ఎస్‌బీఐ మంజూరు చేస్తోంది.

3. కొత్త కార్ రుణాలు
కార్ల కొనుగోలుకి సంబంధించి ఎస్‌బీఐ వివిధ రుణాల‌ను మంజూరు చేస్తోంది. ఈ రుణాల ప‌రిధిలో వినియోగ‌దారులు ప్యాసింజ‌ర్ కార్లు, మ‌ల్టీ యుటిలిటీ వాహ‌నాలు, స్పోర్ట్స్ యుటిలిటీ కార్ల‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. వీటిపై ఓవ‌ర్‌డ్రాఫ్ట్ స‌దుపాయం కూడా ఉన్న‌ట్లు ఎస్‌బీఐ ప్ర‌క‌టించింది.ఈ త‌ర‌హా రుణాల కోసం ముందే పెనాల్టీ చెల్లించ‌డం, అడ్వాన్స్ ఈఎమ్ఐ క‌ట్ట‌డం లాంటి అవ‌స‌రం లేద‌ని బ్యాంక్ స్ప‌ష్టం చేసింది.

4. ఆస్తుల‌పై త‌న‌ఖా రుణాలు
వ్య‌క్తుల ఆర్థిక అవ‌స‌రాలు తీరేందుకు ఆస్తులపై త‌న‌ఖా రుణాలిస్తున్న‌ట్లు ఎస్‌బీఐ త‌న పోర్ట‌ల్‌లో పేర్కొంది. ఈ త‌ర‌హా రుణాల‌ను బ‌హుళ ప్ర‌యోజ‌న‌క‌ర రుణాలు అని కూడా వ్య‌వ‌హ‌రిస్తారు. న‌గ‌దు స‌మ‌స్య‌లు ఎదురయిన‌ప్పుడు వ్య‌క్తులు త‌మ ఆస్తుల‌ను హామీగా చూపించి ఈ రుణాల‌ను పొంద‌వ‌చ్చు. 
బ్యాంక్ నిర్ణ‌యించిన వ‌డ్డీ రేటు ప్ర‌కారం తిరిగి చెల్లించేట‌ప్పుడు నెల‌వారీ వాయిదాల(ఈఎమ్ఐ) రూపంలోనూ చెల్లించ‌వ‌చ్చు. ఆస్తులున్న ప్రాంతం, ఇత‌ర ప‌రామితులను బ‌ట్టి క‌నిష్టంగా రూ.10 లక్ష‌ల నుంచి గ‌రిష్టంగా రూ.7.5 కోట్ల వ‌ర‌కు ఈ త‌ర‌హా రుణాలిస్తున్న‌ట్లు ఎస్‌బీఐ తెలిపింది.

5. వ్య‌క్తిగ‌త రుణాలు
వ్య‌క్తుల అవ‌స‌రాల‌ను బ‌ట్టి వివిధ ర‌కాల వ్య‌క్తిగ‌త రుణాల‌ను ఎస్‌బీఐ అందిస్తోంది. ఎలాంటి పూచీక‌త్తు, హామీ లేకుండా రుణ‌దాత‌లు ఈ త‌ర‌హా రుణాల‌ను పొందే వెసులుబాటు ఉంది. వ్య‌క్తులు వారి నెల ఆదాయానికి 12 రెట్ల వ‌ర‌కు వ్య‌క్తిగ‌త రుణాలు పోందే అవ‌కాశం ఉంద‌ని బ్యాంక్ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని