ఉద్యోగం కోసం కొత్త ప్రాంతానికి మారుతున్నారా?

కొత్త ప్రాంతానికి లేదా వేరే ఇంటికి మారుతున్న‌ప్ప‌డు ఆర్థిక అవ‌స‌రాల‌ను తీర్చేందుకు అద్దె డిపాజిట్ రుణాలు (రెంట‌ల్ డిపాజిట్ లోన్స్) ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఈ రోజుల్లో ఉద్యోగం, కొత్త అవ‌కాశాల కోసం ఒక చోటు నుంచి మ‌రో చోటుకి మారుతుండ‌టం సాధారణం అయిపోయింది. ఇలాంటి స‌మ‌యంలో

Published : 18 Dec 2020 16:10 IST

కొత్త ప్రాంతానికి లేదా వేరే ఇంటికి మారుతున్న‌ప్ప‌డు ఆర్థిక అవ‌స‌రాల‌ను తీర్చేందుకు అద్దె డిపాజిట్ రుణాలు (రెంట‌ల్ డిపాజిట్ లోన్స్) ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఈ రోజుల్లో ఉద్యోగం, కొత్త అవ‌కాశాల కోసం ఒక చోటు నుంచి మ‌రో చోటుకి మారుతుండ‌టం సాధారణం అయిపోయింది. ఇలాంటి స‌మ‌యంలో ఈ స్వ‌ల్పకాలిక రుణాలు ఆర్థిక భ‌ద్ర‌త‌ను ఇస్తాయి.

ఉదాహ‌ర‌ణ‌కు బెంగుళూరును తీసుకుందాం. బెంగుళూరు న‌గ‌రం ఇప్పుడు అతిపెద్ద టెక్ హ‌బ్‌గా మారిపోయింది. అయితే బెంగుళూరులో ఇల్లు మార‌డం అంత సుల‌భం కాదు. 10 నుంచి 12 నెల‌ల అద్దెను అడ్వాన్స్‌గా అడుగుతుంటారు. ఇలాంటి స‌మ‌యంలో ఈ రుణాల అవ‌స‌రం ఉంటుంది. కొత్త‌గా ఉద్యోగంలోకి చేరుతున్న‌వారికి అప్పుడే అంత‌మొత్తంలో డ‌బ్బును స‌మ‌కూర్చుకోవ‌డం క‌ష్టం. అందుకే బెంగుళూరు, ముంబ‌యి వంటి న‌గ‌రాల్లో అద్దె డిపాజిట్ రుణ‌లకు డిమాండ్ ఎక్కువ‌గా ఉంటుంద‌ని నెల‌వారి వాయిదాలు లేకుండా రుణాల‌ను అందించే, ఆర్‌బీఐ న‌మోదితి సంస్థ‌ లోన్‌ట్యాప్.ఇన్, స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు, సీఈఓ స‌త్యం కుమార్ వెల్లడించారు. కొన్ని కంపెనీలు షిప్టింగ్ ఛార్జీలు, కొద్ది రోజుల వ‌ర‌కు ఉండేందుకు సౌక‌ర్యాల‌ను క‌ల్పిస్తాయ‌ని తెలిపారు.

దేశంలో ఉన్న‌త విద్య‌ను అభ్య‌సించిన విద్యార్థులు ఉద్యోగాల కోసం వేట ప్రారంభించే స‌మ‌య‌మిది. దీనికోసం దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల‌కు చేరుకుంటారు. కొత్త‌గా న‌గ‌రానికి చేరుకున్న‌వారికి కొత్త ప్రాంతంలో ఖ‌ర్చుల‌ను అధిగ‌మించ‌డం, ఇంటి అద్దె అడ్వాన్స్ చెల్లించ‌డం వంటివి అంత త‌క్కువ కాలంలో వారు సొంతంగా చేసుకోవ‌డం ఆర్థికంగా ఇబ్బంది అవుతుంది. దీనికోసం వ్య‌క్తిగ‌త రుణాలు తీసుకోవ‌డం లేదంటే ఇతర మార్గాల‌ను ఎంచుకోవ‌డం వంటివి చేస్తున్నారు.

రెంట‌ల్ డిపాజిట్ లోన్స్, ఈఎమ్ఐ-ఫ్రీ లోన్స్ వంటివి ఇలాంట‌ప్పుడు ప‌నికొస్తాయి. రెంట‌ల్ డిపాజిట్ రుణాలు సాధారణంగా రూ.1 నుంచి రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కు పొంద‌వ‌చ్చు. కాల‌ప‌రిమితి 11 నుంచి 33 నెల‌లు ఉంటుంది. లీజు గ‌డువు ముగిసేంత వ‌ర‌కు కేవ‌లం వ‌డ్డీ మాత్ర‌మే చెల్లించే అవ‌కాశం ఉంది. ఇక్క‌డ చెప్ప‌కోఉవాల్సింది ఏంటంటే ఈ రుణాలు అవ‌స‌రానికి చేతికి అందుతాయి. ఆన్‌లైన్‌లో దాఖ‌లు చేసుకున్న 24 నుంచి 48 గంట‌ల్లోనే రుణం ల‌భిస్తుంది. దీంతో ఎలాంటి ఆర్థిక భారం లేకుండా సుల‌భంగా ఇల్లు మార‌వ‌చ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని