గృహ రుణ ఈఎమ్ఐ ఎంత శాతం ఉండాలి?

గృహ‌రుణం చెల్లించ‌డంలో ఈఎమ్ఐ శాతం ఎంత ఉండాలి? గృహ రుణ ఈఎమ్ఐ చెల్లింపుల కోసం స్థూల ఆదాయంలో ఎంత మొత్తాన్ని కేటాయించాలి అనేది చాలా మంది సందేహం. గృహ రుణ చెల్లింపుల‌లో భాగంగా ఒక‌రి నెలవారీ జీతంలో ఎంత మొత్తాన్ని ఈఎమ్ఐగా చెల్లించాలో ఇప్పుడు చూద్దాం… సౌక‌ర్య‌వంత‌మైన ఈఎమ్ఐ కోసం

Published : 23 Dec 2020 13:08 IST

ఆస్తిని కొనుగోలు చేయాల‌నుకున్న‌ప్పుడు, ప‌న్ను చెల్లించిన త‌రువాత ఆదాయంలో 30 శాతం ఈఎమ్ఐ చెల్లించేందుకు, 30 శాతం నెల‌వారీ ఖ‌ర్చుల‌కు, 30 శాతం పెట్టుబ‌డుల‌కు, 10 శాతం ఇత‌ర ఖ‌ర్చుల‌కు కేటాయించ‌డం మంచిది.

గృహ‌రుణం చెల్లించ‌డంలో ఈఎమ్ఐ శాతం ఎంత ఉండాలి? గృహ రుణ ఈఎమ్ఐ చెల్లింపుల కోసం స్థూల ఆదాయంలో ఎంత మొత్తాన్ని కేటాయించాలి అనేది చాలా మంది సందేహం. గృహ రుణ చెల్లింపుల‌లో భాగంగా ఒక‌రి నెలవారీ జీతంలో ఎంత మొత్తాన్ని ఈఎమ్ఐగా చెల్లించాలో ఇప్పుడు చూద్దాం… సౌక‌ర్య‌వంత‌మైన ఈఎమ్ఐ కోసం థంభ్ రూల్ కోసం చూస్తుంటాం అయితే మీరు కొనుగోలు చేయాల‌నుకున్న ఇల్లు లేదా అపార్టుమెంటు ఈఎమ్‌ను నిర్ణ‌యిస్తుంది. చాలా అరుదుగా మాత్ర‌మే సౌక‌ర్య‌వంత‌మైన ఈఎమ్ఐను మీరు కొనుగోలు చేసిన ఆస్తి నిర్ణ‌యిస్తుంది. గృహ‌రుణం చెల్లించేందుకు అనుకూలంగా ఉండే ఈఎమ్ఐ = నెల‌వారీ ఆదాయం నుంచి 40 శాతం భాగం లేదా కొనుగోలు చేసే ఆస్తిని బ‌ట్టి 45 నుంచి 50 శాతానికి కూడా పెర‌గ‌వ‌చ్చు. ఆస్తి కొనుగోలు ఎల్లప్పుడూ పెట్టుబడులను ప్రభావితం చేస్తాయి. మీరు ఆస్తిని కొనుగోలు చేయాల‌నుకున్న‌ప్పుడు, ప‌న్ను చెల్లించిన త‌రువాత ఆదాయంలో 30 శాతం ఈఎమ్ఐ చెల్లించేందుకు, 30 శాతం నెల‌వారీ ఖ‌ర్చుల‌కు, 30 శాతం పెట్టుబ‌డుల‌కు, 10 శాతం ఇత‌ర ఖ‌ర్చుల‌కు కేటాయించ‌డం మంచిది. అయితే చాలా మంది ప‌న్ను చెల్లింపులు త‌రువాత మిగిలిన ఆదాయం మొత్తంలో 40 నుంచి 55 శాతం ఈఎమ్ఐ, 40 నుంచి 45 శాతం నెల‌వారీ ఖ‌ర్చుల‌కు కేటాయిస్తున్నారు. అందువ‌ల్ల వారికి, మిగిలిన కొద్ది మొత్తంతో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఆస్కారం ఉండ‌దు. కానీ ప్రారంభంలో ఈపీఎఫ్ కోసం పెట్టుబ‌డులు పెట్ట‌డం చాలా మందికి త‌ప్ప‌నిస‌రిగా ఉంటుంది. అందువ‌ల్ల ఈఎమ్ఐను త‌గ్గించుకునేందుకు గృహాన్ని కొనుగోలు చేయ‌డం కంటే అద్దెకు తీసుకోవ‌డం మంచిది.

దీర్ఘ‌కాల ఆర్థిక ల‌క్ష్యాల పెట్టుబ‌డులు ప్ర‌భావితం కాకుండా ఇంటిని కొనుగోలు చేయ‌డం వాయిదా వేసి, మీరు ప‌నిచేసే వృత్తిలో, మీ వ్య‌క్తిగ‌త జీవితంలో స్థిర‌ప‌డిన అనంత‌రం గృహాన్ని కొనుగోలు చేయాలి. ఆ స‌మ‌యానికి మీ ఆదాయం కూడా పెరిగే అవ‌కాశం ఉంటుంది. గృహాన్ని ఎప్పుడు కొనుగోలు చేయాలి? స‌ంపాద‌న ప్రారంభ‌మైన తొలి రోజుల్లోనా? చివ‌రి రోజుల్లోనా? ప్రారంభంలో కొనుగోలు చేయ‌డం వ‌ల్ల లాభాలు: ఆస్తిని త‌క్కువ ధ‌ర‌కే పొంద‌గ‌లిగే అవ‌కాశం ఉంటుంది. రుణం త్వ‌ర‌గా చెల్లించ‌వ‌చ్చు, సొంత ఇంటిలో నివ‌సించ‌వ‌చ్చు. రుణాన్ని స‌మ‌యానికి చెల్లించే అవ‌కాశం ఉంటుంది, యుక్త వ‌య‌స్సు, ఉద్యోగంలో ఉండ‌గానే ఇంటిని నిర్మించుకోవ‌చ్చు. ప్రారంభంలో కొనుగోలు చేయ‌డం వ‌ల్ల న‌ష్టాలు:ఈఎమ్ఐ చాలా ఎక్కువ‌గా ఉంటుంది, త‌గినంత‌ పెట్టుబ‌డులు పెట్ట‌లేక‌పోవ‌డం వ‌ల్ల ప‌ద‌వీప‌ర‌మ‌ణ ప్ర‌ణాళిక‌కు ముందుగా ఆటంకం ఏర్ప‌డుతుంది, ప‌ద‌వీవిర‌మ‌ణ స‌మ‌యానికి కొనుగోలు చేసిన ఇల్లు పాత‌బ‌డ‌టం వ‌ల్ల ఇంటి ధ‌ర త‌గ్గే అవ‌కాశం ఉంది, మీరు వేరే ప్ర‌దేశానికి మారితే స‌మ‌స్య‌లు ఉంటాయి. ఆదాయం గ‌ణ‌నీయంగా పెరుగ‌కపోతే ముంద‌స్తు ప‌ద‌వీవిర‌మ‌ణ సాధ్యం కాదు.

ఆల‌స్యంగా కొనుగోలు చేయ‌డం వ‌ల్ల లాభాలు:
* ప‌ద‌వీవిర‌మ‌ణపై స్ప‌ష్ట‌త ఉంటుంది.
* స‌రైన పెట్టుబ‌డులతో, ఆర్ధిక ల‌క్ష్యాల‌ను చేరుకోవ‌చ్చు
* ప‌ద‌వీవిర‌మ‌ణ స‌మ‌యానికి ఆస్తి విలువ‌లో పెద్ద‌గా తేడా ఉండ‌దు.

ఆలస్యంగా కొనుగోలు చేయ‌డం వ‌ల్ల న‌ష్టాలు:

* స‌రైన ఆస్తిని కొనుగోలు చేయ‌లేక‌పోవ‌చ్చు.
* జీవిత‌పు మ‌ధ్య వ‌య‌స్సులో రుణ‌భారం ప‌డుతుంది.
* తొంద‌ర‌గా ప‌ద‌వీవిర‌మ‌ణ చేయ‌డం సాధ్యం కాదు.

ఆస్తి సంపాద‌న ప్రారంభ‌మైన తొలి రోజుల్లో లేదా చివ‌రి రోజుల్లో కొనుగోలు చేయాలా నిర్ణ‌యించుకోవ‌డం అంత సుల‌భం కాదు. ఆర్థిక ప‌రిస్థితుల‌తో సంబంధం లేకుండా సంపాదనా సామ‌ర్ధాన్ని మెరుగుప‌రుచుకునే నైపుణ్యం, మంచి చ‌దువు, ఉద్యోగం ఉన్న వారు ప్రారంభ రోజుల్లోనే ఆస్తిని కొనుగోలు చేయ‌వ‌చ్చు. సంపాద‌నా సామ‌ర్ధాన్ని, నైపుణ్యాన్ని వారి అనుభవంతో పెంచుకునే వారు ఆల‌స్యంగా కొనుగోలు చేయ‌డం ద్వారా మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. భ‌విష్య‌త్తు నిర్ధిష్టంగా ఉండ‌దు కాబ‌ట్టి ప్రారంభ‌రోజుల్లోనే గృహం కొనుగోలు చేయ‌డం మంచిద‌ని కొంద‌రి వాద‌న‌. ఏదిఏమైన‌ప్ప‌టికీ దీర్ఘ‌కాల ల‌క్ష్యాల‌పై అధిక ఈఎమ్ఐ చూపించే ప్ర‌భావాన్ని అర్ధం చేసుకోవాలి. ఇంటి రుణం తీసుకుని ఇంటి కొనుగోలు చేయ‌డం వ‌ల్ల నెల‌వారి ఈఎమ్ఐ క్ర‌మంగా చెల్లించాలి. కాబ‌ట్టి ఇత‌ర ఆర్థిక ల‌క్ష్యాల‌పై ఈ ప్ర‌భావం ప‌డే అవ‌కాశం ఉంటుంది. కాబ‌ట్టి మ‌దుప‌ర్లు ఈ విష‌యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇంటి కొనుగోలు ఏ స‌మ‌యంలో చేయాల‌నేది నిర్ణ‌యించుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని