స్థిరమైన లాభాల కోసం...

కార్పొరేట్‌ బాండ్లలో మదుపు చేసే  ఓపెన్‌ ఎండెడ్‌ పథకాన్ని మిరే అసెట్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఆవిష్కరించింది. దీని పేరు మిరే అసెట్‌ కార్పొరేట్‌ బాండ్‌ ఫండ్‌. ఈ పథకం న్యూ ఫండ్‌ ఆఫర్‌ (ఎన్‌ఎఫ్‌ఓ) వచ్చే నెల 9న ముగుస్తుంది. ఈ పథకం ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి..

Updated : 26 Feb 2021 06:16 IST

కార్పొరేట్‌ బాండ్లలో మదుపు చేసే  ఓపెన్‌ ఎండెడ్‌ పథకాన్ని మిరే అసెట్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఆవిష్కరించింది. దీని పేరు మిరే అసెట్‌ కార్పొరేట్‌ బాండ్‌ ఫండ్‌. ఈ పథకం న్యూ ఫండ్‌ ఆఫర్‌ (ఎన్‌ఎఫ్‌ఓ) వచ్చే నెల 9న ముగుస్తుంది. ఈ పథకం ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి..
* ప్రధానంగా ఏఏ+ రేటింగ్‌ ఉన్న కార్పొరేట్‌ బాండ్లలో పెట్టుబడి పెట్టి మదుపరులకు స్థిరమైన లాభాలు ఆర్జించటం ప్రధానోద్దేశం. కొంత పెట్టుబడిని ప్రభుత్వ సెక్యూరిటీలు, టీ-బిల్స్‌ కు కేటాయిస్తారు.
* కనీస పెట్టుబడి రూ.5,000. ఎగ్జిట్‌ లోడ్‌ లేదు.
* ఇతర డెట్‌ ఫండ్లు, స్థిర ఆదాయాన్నిచ్చే (ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌) పత్రాలతో పోలిస్తే, రిస్కు సర్దుబాటు చేసిన తర్వాత వచ్చే రాబడి విషయంలో ఈ పథకం మెరుగైనదిగా  కనిపిస్తోంది.
* మూడేళ్లకు మించిన కాలానికి ఈ ఫండ్‌లో పెట్టుబడి పెడితే ఆదాయపు పన్ను ‘ఇండెక్సేషన్‌ ప్రయోజనం’ లభిస్తుంది.
* నిఫ్టీ కార్పొరేట్‌ బాండ్‌ ఇండెక్స్‌తో దీని పనితీరును పోల్చి చూస్తారు.
* దీనికి మహేంద్ర జాజూ ఫండ్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తారు.


నష్టభయం ఉన్నా.. అధిక ప్రతిఫలం...

తక్కువ ఖర్చుతో కూడిన పరిమాణాత్మక వ్యూహాలతో నిర్వహించే మ్యూచువల్‌ ఫండ్‌ పథకం కోసం చూస్తున్న మదుపరులకు ‘యూటీఐ నిఫ్టీ 200 మొమెంటమ్‌ 30 ఫండ్‌’  ఒక ఆసక్తికరమైన పథకంగా చెప్పుకోవచ్చు. నిఫ్టీ 200 మొమెంటమ్‌ 30 ఇండెక్స్‌ పనితీరును దీనికి ప్రామాణికంగా తీసుకుంటారు. కానీ ఫండ్‌ క్రియాశీలకంగా వ్యవహరించే పథకం కాబట్టి, దీన్ని సంప్రదాయ నిష్క్రియాత్మక నిర్వహణ పథకంతో పోల్చితే భిన్నమైనది. స్టాక్‌మార్కెట్లో నమోదైన షేర్లపై... ఆరు నెలల నుంచి ఏడాది కాలంలో లభించిన ప్రతిఫలం ఆధారంగా ‘మొమెంటమ్‌ స్కోర్‌’ ను లెక్కించి, దాని ప్రకారం ఏఏ షేర్లలో ఈ పథకం కింద పెట్టుబడి పెట్టాలనేది నిర్ణయిస్తారు. ఒక్కో షేర్‌కు 5 శాతం కంటే ఎక్కువ మొత్తాన్ని కేటాయించరు. ఒక రకంగా చెప్పాలంటే, ఇది నిబంధనల ఆధారంగా నిర్వహించే క్వాంట్‌ ఫండ్‌ మాదిరిగా ఉంటుంది. అధిక రిస్కు, అధిక ప్రతిఫలం ఇటువంటి పథకాల విషయంలో సర్వసాధారణం. దీర్ఘకాలం పాటు ఎదురుచూడగలిగితే  ఇటువంటి పథకాలపై ఆకర్షణీయమైన రాబడి లభిస్తుంది.
యూటీఐ నిఫ్టీ 200 మొమెంటమ్‌ 30 ఫండ్‌ ఎన్‌ఎఫ్‌ఓ వచ్చే నెల 4న ముగుస్తుంది. కనీస పెట్టుబడి రూ.5,000. ఎంట్రీ, ఎగ్జిట్‌ లోడ్‌ ఉండవు. ఈ పథకానికి శర్వాన్‌ కుమార్‌ గోయల్‌ ఫండ్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తారు. ఆయనకు ఫండ్‌ మేనేజర్‌గా 13 ఏళ్ల అనుభవం ఉంది. యూటీఐ మ్యూచువల్‌ ఫండ్‌లోనే మరో 9 పథకాలను ఆయన నిర్వహిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని