పియాజియో ఏప్రిలియా స్కూటర్లు

ఇటలీకి చెందిన ప్రీమియం స్కూటర్‌ కంపెనీ పియాజియో భారత అనుబంధ సంస్థ పియాజియో ఇండియా.. తమ కొత్త ఏప్రిలియా స్కూటర్లను దక్షిణాది రాష్ట్రాల్లోని 100కు...

Updated : 22 Dec 2021 11:03 IST

ధర రూ.1.08-1.16 లక్షలు

ముంబయి: ఇటలీకి చెందిన ప్రీమియం స్కూటర్‌ కంపెనీ పియాజియో భారత అనుబంధ సంస్థ పియాజియో ఇండియా.. తమ కొత్త ఏప్రిలియా స్కూటర్లను దక్షిణాది రాష్ట్రాల్లోని 100కు పైగా మోటోప్లెక్స్‌ మల్టీ-బ్రాండ్‌ రిటైల్‌ విక్రయ కేంద్రాల్లో అందుబాటులో ఉంచామని వెల్లడించింది. దేశంలో పియాజియో ద్విచక్ర వాహన విక్రయాల్లో దక్షిణాది వాటా సుమారు 45 శాతం ఉంటుందని తెలిపింది. దేశీయ విపణిలో వెస్పా బ్రాండ్‌ స్కూటర్లను కూడా సంస్థ తయారు చేసి విక్రయిస్తోంది. కొత్త డిజైన్‌, ఫీచర్లతో నవీకరించిన ఏప్రిలియా స్కూటర్లను దేశీయ విపణిలో పియాజియో గత నెలలో ప్రవేశపెట్టింది. ఏప్రిలియా ఎస్‌ఆర్‌ 160 ధర రూ.1.16 లక్షలు, ఎస్‌ఆర్‌ 125 ధర రూ.1.08 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్‌, బెంగళూరు) నిర్ణయించింది. కంపెనీ ఇ-కామర్స్‌ వెబ్‌సైట్‌ ద్వారా రూ.5,000 చెల్లించి స్కూటర్లను బుక్‌ చేసుకోవచ్చని తెలిపింది. ఎస్‌ఆర్‌ 160 స్కూటర్‌ 160 సీసీ బీఎస్‌-6 3వీ టెక్‌ ఈఎఫ్‌ఐ ఇంజిన్‌తో రూపొందింది. ఇది 125 సీసీ ఎంపికతోనూ లభ్యమవుతుందని కంపెనీ పేర్కొంది. యాంటీలాక్‌ బ్రేకింగ్‌ వ్యవస్థ (ఏబీఎస్‌), 3వీ-టెక్‌ 160 సీసీ ఇంజిన్‌ వంటి సదుపాయాలు స్కూటర్లలో తొలిసారిగా అందిస్తున్నామని పియాజియో ఇండియా సీఎండీ దైగో గ్రాఫీ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని