బీమా రంగంలో 74% ఎఫ్‌డీఐలు

బీమా రంగానికి సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బీమా రంగంలో ప్రస్తుతం 49 శాతంగా

Updated : 01 Feb 2021 12:56 IST

ఈ ఏడాదే ఎల్‌ఐసీ ఐపీవో

దిల్లీ: బీమా రంగానికి సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బీమా రంగంలో ప్రస్తుతం 49 శాతంగా ఉన్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితిని 74 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది. విదేశీ పెట్టుబడిదారులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు.

ఎఫ్‌డీఐ పరిమితిని పెంచేందుకు బీమా చట్టం- 1938కి సవరణ చేయనున్నట్లు నిర్మలా సీతారామన్‌ తెలిపారు. అయితే, మెజారిటీ డైరెక్టర్లు, మేనేజ్‌మెంట్‌కు చెందిన వ్యక్తులు భారతీయులే అయ్యి ఉండాలన్న నిబంధన విధించనున్నట్లు తెలిపారు. 50 శాతం మంది డైరెక్టర్లు స్వతంత్రులై ఉండాలని పేర్కొన్నారు. అలాగే, ఎల్‌ఐసీని ఐపీవోను ఈ ఏడాదే తీసుకురావాలని నిర్ణయించినట్లు సీతారామన్‌ వెల్లడించారు. అలాగే, రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పెట్టుబడుల ఉపసంహరణ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. 

ఇదీ చదవండి..
బడ్జెట్‌ విశేషాలు.. లైవ్‌బ్లాగ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని