GST: రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు.. ఏప్రిల్‌ తర్వాత రెండో అత్యధికం

GST collections: అక్టోబర్‌ నెలలో జీఎస్టీ వసూళ్లు మరోసారి భారీగా నమోదయ్యాయి. మొత్తం 1.72 లక్షల కోట్లు వచ్చినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

Updated : 02 Nov 2023 14:20 IST

GST collections: దిల్లీ: దేశంలో మరోసారి జీఎస్టీ వసూళ్లు (GST collections) భారీగా నమోదయ్యాయి. అక్టోబర్‌ నెలకు గాను రూ.1.72 లక్షల కోట్లు వసూలయ్యాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఈ ఏడాది ఏప్రిల్‌లో నమోదైన 1.87 లక్షల కోట్లు అత్యధికం కాగా.. తాజా వసూళ్లు రెండో అత్యధికంగా నిలిచాయి. గతేడాదితో రూ.1.66 లక్షల కోట్లతో పోలిస్తే వసూళ్లు 13 శాతం మేర పెరిగాయి.

క్రెడిట్‌ కార్డు తీసుకొని వాడట్లేదా.. ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

అక్టోబర్‌ నెల మొత్తం వసూళ్లలో సీజీఎస్టీ రూపంలో 30,062 కోట్లు, ఎస్‌జీఎస్టీ రూ.38,171 కోట్లు సమకూరినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఐజీఎస్టీ రూపంలో రూ.91,315 కోట్లు రాగా.. రూ.12,456 కోట్లు సెస్సుల రూపంలో వచ్చినట్లు వెల్లడించింది. ఐజీఎస్టీ సెటిల్‌మెంట్‌ అనంతరం అక్టోబర్‌ నెలకు కేంద్రానికి రూ.72,934 కోట్లు, రాష్ట్రాలకు రూ.74,785 కోట్ల ఆదాయం సమకూరినట్లు పేర్కొంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని